వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లపై ఎప్పటి నుండో ప్రచారం జరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ విధి, విధానాలు వ్యతిరేకిస్తున్నా.. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని స్పష్టం చేసారు. ఏపీలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించాలనే నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది.
Advertisement
ఆరు నెలల్లో ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో మోటార్లు ఏర్పాటులో ప్రభుత్వం వేగం పెంచింది. ఇందులో భాగంగా విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 6 నెలల్లో మీటర్లు పెట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. వ్యవసాయ మీటర్ల ఏర్పాటుతో కచ్చితమైన విద్యుత్ వినియోగం తెలుస్తుందని అన్నారు.
Advertisement
రైతులకు నాణ్యమైన అందించడమే ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేసారు మంత్రి పెద్దిరెడ్డి. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్ మీటర్లపై ప్రతిపక్షాలది అసత్య ప్రచారం అని ఆయన కొట్టిపారేసారు. రైతులు వినియోగించిన విద్యుత్ చార్జీలను డీబీటీ కింద ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకే జమ చేస్తుందన్నారు. రైతులే నేరుగా డిస్కమ్‌లకు చెల్లింపులు జరుపుతారన్నారు. దీంతో డిస్కంలలో జవాబుదారితనం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు రైతులతో నూరు శాతం బ్యాంకు ఖాతాలు తెరిపించాలని స్పష్టం చేసారు. డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడానికి డిస్కంలు సహకరించాలని మంత్రి పెద్దిరెడ్డి సూచనలు చేశారు.
Also Read :
ఈ పేర్లు ఉండే అమ్మాయిలు.. లక్ష్మీదేవితో సమానం.. పుట్టింటికి సిరిసంపదలు తెస్తారట..!!
విజయ్ దేవరకొండతో క్లోజ్ పిక్ ను షేర్ చేసిన సమంత…కపుల్స్ అంటూ నెటిజన్ల వింత రియాక్షన్స్…!