Home » విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క్లోజ్ పిక్ ను షేర్ చేసిన స‌మంత‌…క‌పుల్స్ అంటూ నెటిజ‌న్ల వింత రియాక్ష‌న్స్…!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క్లోజ్ పిక్ ను షేర్ చేసిన స‌మంత‌…క‌పుల్స్ అంటూ నెటిజ‌న్ల వింత రియాక్ష‌న్స్…!

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నేడు పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా త‌క్కువ స్టేజ్ నుండి స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా విజ‌య్ పూరీజ‌గ‌న్నాత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లైగ‌ర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా కూడా ప‌రిచ‌యం అవ్వ‌బోతున్నాడు.

Advertisement

ఇదిలా ఉండ‌గానే మ‌రికొన్ని సినిమాల‌తో విజ‌య్ బిజీగా మారిపోయాడు. ఆ సినిమాల‌లో శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో చేస్తున్న సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాలో స‌మంత హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా విజయ్ దేవ‌ర‌కొండ స‌మంత‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ షూటింగ్ మ‌ధ్య‌లో స‌మంత‌ను స‌ర్ప్రైజ్ చేశాడు.

ఇక నేడు విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు సంధ‌ర్బంగా స‌మంత కూడా అత‌డితో క‌లిసి దిగిన ఓ ఫోటోను నెట్టింట పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు స‌మంత హ్యాపి బ‌ర్త్ డే లైగ‌ర్…ఈ ఏడాది రాబోయే ప్ర‌శంస‌లు విజ‌యాలు అందుకోవ‌డానికి నువ్వు అర్హుడ‌వే..నువ్వు క‌ష్ట‌ప‌డే తీరు చాలా మందికి స్పూర్తిదాయ‌కం. గాడ్ బ్లెస్ యూ….అంటూ స‌మంత త‌న పోస్ట్ లో పేర్కొంది. అయితే స‌మంత విజ‌య్ తో క‌లిసి షేర్ చేసిన ఫోటోకు నెటిజ‌న్లు వింత రియాక్ష‌న్ లు ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

క్యూట్ కపుల్ అని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్ట‌గా….లవ్లీ క‌పుల్స్ అంటూ మ‌రికొంద‌రు కామెంట్ లు పెడుతున్నారు. ఇక మ‌రికొంద‌ర‌యితే ల‌వ్ ఎమోజీల‌తో కామెంట్ ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం వీరి ఫోటోల‌కే ఇంత క్రేజ్ వ‌స్తే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమాకు ఎలాంటి క్రేజ్ వ‌స్తుందో చూడాలి.

ALSO READ :

బాహుబలి సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా…జక్కన్న మరీ ఇంత చిన్న లాజిక్ ఎలా …?

ప్రేమదేశం సినిమాతో యూత్ ను ఊపేసిన అబ్బాస్…ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు..ఏం చేస్తున్నాడో తెలుసా…!

Visitors Are Also Reading