Home » రీసెంట్ గా విడుదలైన 8 ఓటీటీ సినిమాలు, తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ఇవే..!

రీసెంట్ గా విడుదలైన 8 ఓటీటీ సినిమాలు, తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ఇవే..!

by Anji
Ad

సాధారణంగా కరోనా మహమ్మారి తరువాత ప్రతీ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా విడుదలవుతోంది. కరోనా పుణ్యామా అని కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండానే ఇప్పటికీ కూడా నేరుగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు కూడా ఉన్నాయి. ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు కరోనా కంటే ముందు చాలా తక్కువగా వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్ ని పెంచుకోవడం కోసంకొన్ని సినిమాలు థియేటర్ లో రన్ అవుతూనే మరోవైపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడం విశేషం. రీసెంట్ విడుదలైన 8 బెస్ట్ ఓటీటీ సినిమాలు మరియు తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ఏయే ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ కానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

లవ్ టుడే 

Manam News

హీరో అండ్ డైరెక్టర్ అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ 5 సంవత్సరాల ముందు తీసిన ఓ షార్ట్ ఫిలిం నుంచి ఈ సినిమా తీశారు. ప్రదీప్, ఇవానా ఈ సినిమాలో లవర్స్. వీరిద్దరికీ ఇవానా తండ్రి సత్యరాజ్ పెట్టిన ఒక కండీషన్ వల్ల ఫోన్లను మార్చుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది అసలు స్టోరీ. ఈ ఒక్క పాయింట్ తో ఎంత ఎంటర్ టైనింగ్ అండ్ ఫర్ ఫెక్ట్ గా తీయగలరో అలా హ్యాండిల్ చేశారు దర్శకుడు. మంచి స్విచ్ వేషన్ గా ఉండడంతో మంచి హ్యుమర్ డెవలప్ అవుతుంది. ఎమోషనల్ విషయానికొస్తే.. ఈ సినిమాలో చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఇందులో ప్రతీ సీన్ కి ఒక ఇంపార్టెంట్ , ప్లో ఉంటుంది. ఇంకా సెటప్స్ అండ్ ప్లే ఆప్స్ కూడా భలే ఉంటాయి. మిస్ అండస్టాండింగ్ లాంటి టాపిక్స్ ని డీల్ చేసి చివరలో ఒక మెసేజ్ ని కూడా ఇచ్చారు. స్టోరీ, స్క్రీన్ ప్లే నే కాకుండా టెక్నికల్ టీమ్ ఎఫెక్ట్ వల్ల లవ్ టుడే మల్టీపుల్ టైమ్స్ వాచ్ చేయవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 

VADHANDHI Prime Video: Vadhandhi:The Fable of Velonie - Season 1

వెలోని అనే అమ్మాయి సస్పీనియస్ గా చనిపోతుంది. ఈ కేసులో దాగి ఉన్న మిస్టరీ ఏంటో సబ్ ఇన్ స్పెక్టర్ వివేక్ ఛేదించాలి. చివరికీ ఏమైందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. క్యారెక్టర్ పరిచయానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ సిరీస్ స్లోగా ఉన్న క్యూరియస్ గా ఉంటుంది. మొదటి ఎపిసోడ్ ఒక లా ఉంటే.. ఆ తరువాత ఎపిసోడ్స్ ఫుల్ ఎగ్జయిట్మెంట్ తో వెళ్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో దాదాపు 10 నుంచి 15 వరకు ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. వారిని వివేక్ ఇన్విస్టిగేషన్ చేయడం.. ఇవన్నీ నార్మల్ గా కంటే ఎక్కువనే రివీల్ చేస్తారు. కొన్ని సీన్స్ వల్ల ఈ సిరిస్ ని ఫ్యామిలీతో చూడడం అంత మంచిది కాదు. తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Hunt

'Squid Game' star Lee Jung Jae hunts down Cannes glory with directorial  debut 'Hunt' - Times of India

1980 సమయంలో సౌత్ కొరియాలో కొన్ని ఈవెంట్స్ బ్యాక్ డ్రాప్ ని ఉపయోగించి తీసిన ఒకన ఫిక్షనల్ సినిమా ఇది. దీనిని దర్శకత్వం వహించింది లీ జుంగ్ జే. ఈ సినిమాలో ఒక హీరోగా కూడా లీజుంగ్ నటించాడు. సౌత్ కొరియా అధ్యక్షుడిని చంపడానికి నార్త్ కొరియా ప్రయత్నిస్తుందని.. వాళ్ల టీమ్ లోనే సీక్రెట్ ఫై లాంటి ఒక మోల్ ఉన్నాడని తెలుస్తోంది. అది ఎవరు ? నెక్ట్స్ ఏంటి అనేది ఈ సినిమాలో చూడవచ్చు. ఆ సీక్రెట్ ఫై ఎవరనేది ఒక ట్విస్ట్ అయితే.. క్లైమాక్స్ మరికొన్ని టర్మ్స్ ఉంటాయి. ప్రారంభం నుంచే పాయింట్ కి తీసుకెళ్లారు. ఈ సినిమాను చూడాలనుకుంటే తెలుగులో ప్రైమ్ వీడియోలో ఉంది. 

THE SWIMMERS 

The Swimmers movie review: True refugee story regales with gripping drama  but swims in shallow waters-Entertainment News , Firstpost

ఇది వాస్తవ కథను బేస్ చేసుకుని వచ్చిన ఒక బయోగ్రాఫికల్ ఫిలిం. సిరియాలో వార్ ఎన్వీరాన్మెంట్ ఉన్నప్పుడు ఇద్దరు స్విమ్మర్ సిస్టర్స్. 2016 ఒలంపిక్స్ లో పాటిసిపెంట్ చేయాలనుకుంటారు. సిరియా సేఫ్ కాదని తెలిసి జర్మనీ వెళ్లాలనుకోగా.. అసలు కథ మొదలు అవుతుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనం కూడా అదే ఎన్విరాన్ మెంట్ లో ఉంటాం. టెన్షన్ పడుతుంటాం. ఈ సినిమాలో స్పోర్ట్స్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా ఇన్ స్పైరింగ్ ఉండి హోప్ క్రియేట్ చేస్తుంది. ఇంకా రియాలిటీకీ చాలా దగ్గరగా ఉండేటట్టు తీస్తుంది. ఫిక్షన్ అనేది ఎక్కువగా లేకుండా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా. 

APPAN

Appan (2022) - IMDb

Advertisement

ఇలాంటి స్టోరీని ఇటీవల కాలంలో చూసింది లేదు. ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు అన్నీ హ్యాపీ ప్రొసీడింగ్ తో తీస్తారు. కానీ ఈ సినిమా అలా కాదు.. హీరో ఫాదర్ కి లోవర్ బాడీ పారలెజ్ అవుతుంది. అప్పట్లో ఆయన ఉమనైజర్ అండ్ ఫ్యామిలీని సరిగ్గా చూసుకున్నది లేదు. ప్రస్తుతం ఎలాంటి ఈవెంట్స్ జరిగాయన్నది రెస్ట్ ఆప్ ది స్టోరీ. ఒక రకంగా డిస్ ఫంక్షన్ అనే ట్రాపిక్ తో మంచి డ్రామా బిల్ చేశారు. సాడ్ ఎన్విరాన్ మెంట్ లోనే ఎంటైర్ సినిమా రన్ అవుతుంది. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రధానంగా హీరో క్యారెక్టర్ ఉన్నవి అయితే టచ్ చేస్తాయి. దీనికి మెయిన్ రీజన్ ఆ రైటింగ్, అంతకు మించి యాక్టర్స్ ఫర్మార్మెన్స్. ఇందులో అందరూ భలే చేశారు. సినిమా అంతా కూడా ఒక ఇంట్లోనే ఉంటుంది. ఆ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంటుంది. ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే.. ఊర్లో వారే చాలా మంది చంపాలనుకుంటారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి క్యారక్టర్ అది. ఫాదర్ సన్ రిలేషన్ షిప్ ని ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ చేస్తున్న డ్రామాను బాగా చూపించారు. ఈ సినిమాను కుటుంబంతో కలిసి కలిసి కాకుండా ఇండివిజుల్ గా చూడండి.  తెలుగులో సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. 

Also Read :  మంచు లక్ష్మిని తన మొదటి భర్తతో విడగొట్టింది మోహన్ బాబు అని మీకు తెలుసా..?

కోమన్ 

Manam News

 

కోమన్ అంటే తెలుగులో గుడ్లగూబ అని అర్థం. థ్రిల్లర్స్ లో తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న దర్శకుడు జీత్ జోసఫ్ లేటెస్ట్ వర్కే ఈ కోమన్ సినిమా. ఇందులో హీరో ఒక కానిస్టేబల్. ఈయనకు ఈగో చాలా ఎక్కువ. దీని వల్ల ఎలాంటి స్విచ్ వేషన్ లోకి వెళ్లాడు. ఛాలెంజింగ్ కేసుతో ఈ సినిమా రన్ అవుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా అనుకోవచ్చు. ఫస్టాప్ అంతా తన పర్సనల్ ప్రాబ్లమ్ అయితే.. సెకండాఫ్ లో కీలకమైన కేసు గురించి అన్నమాట. అసలు హీరో క్యారెక్టరైజేషన్ భలే క్రేజీ గా ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఎగెనిస్ట్ గా చిన్నదంటే చాలు.. రివేంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. చాలెంజ్ చేస్తే అస్సలు వదలడు. ఒక యాంటీ హీరోలా.. అలాగే టైటిల్ కి ట్యాగ్ లేకుండా దినైటర్ అని ఉంటుంది. ఇది ఎందుకుపెట్టారో ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. సినిమాలో ఇది యూనిక్ పాయింట్. అలా ప్రొసిడింగ్స్ ని ఫుల్ ఇంట్రస్టింగ్ గా తీసుకెళ్లడంతో పాటు చివరలో మంచి ట్విస్ట్ పడడంతో సినిమా అంతా సాటిస్ పైగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. 

WEDNESDAY

Manam News

ఇటీవల వచ్చిన ఈ సిరిస్ స్ట్రీమింగ్ కి వచ్చిన రోజు నుంచే బాగా పాపులర్ అయి ట్రెండింగ్ లోకి వెళ్తూనే ఉంది. ఇది వరకు టీవీ సిరీస్, మూవీస్ గా వచ్చి హిట్ కొట్టిన ది ఆడమ్స్ ఫ్యామిలీకి స్పిన్ ఆఫ్ గా దీనిని డిజైన్ చేశారు. WEDNESDAY అనే 16 ఏళ్ల బాలిక ఓ అకాడమీలో చేరిన తరువాత ఇన్వెస్టిగేషన్ మైండ్ తో అక్కడ జరిగిన ఒక మ–ర్  మిస్టరీ సాల్వ్ చేయడం చుట్టూ ఈ సిరీస్ ఉంటుంది. ఇది చేస్తున్నది ఎవరు అనేది కనిపెట్టడమే థ్రిల్లింగ్ ఫ్యాక్టర్. చాలా మంది సస్పెక్ట్స్ వస్తారు మరి. మనం కూడా ఇన్విస్టిగేషన్ చేస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. వెనజ్ డే క్యారెక్టరైజేషన్ కూడా భలే డిఫరెంట్ గా ఉంటుంది. సిరీస్ అంతా తన ఫర్ స్పెక్టివ్ లోనే ఉండడం చూడవచ్చు. ఓల్డ్ బిల్డింగ్ మీద కూడా బాగా ఫోకస్ చేశారు. లైట్ గా హ్యారీ పోర్టర్ లాంటి ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. హిందీ అండ్ తమిళంలోనే డబ్ చేశారు కానీ.. తెలుగులో చేసి ఉంటే బాగుండేది. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. 

Also Read :  పుష్ప,కాంతర చిత్రాలతో ఇండస్ట్రీ నాశనం అవుతోంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

ది పెరిఫెరల్ 

The Peripheral Review: Epic Sci-Fi From the Makers of Westworld

ఈ సినిమా సబ్జెక్ట్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. స్టోరీ అంతా ప్యూచర్ లో జరుగుతుంది. 2030లో అన్నమాట. వర్చువల్ గేమ్స్, టెక్నాలజీ, ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడవచ్చు. గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించుకోవడం లాంటి పాయింట్ లో ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఒక కొత్త వీఆర్ గేమ్ వర్టర్ కి ఎవరో డెలివరీ చేస్తారు. దానిని తన సిస్టన్ ఫ్లిన్ ఆడుతుంది. ఇక తరువాత ఏం జరిగింది అనేది కథ. ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు. సిరీస్ ప్రొసీడ్ అయ్యే కొద్ది వారెవ్వరూ ఇందులో వారి రోల్ ఏంటి ? అనేవి అన్ని తెలుస్తాయి. స్టోరీలోకి వెళ్లే కొద్ది చాలా విషయాలు తెలుస్తాయి. మన క్యారెక్టర్స్ కి ఏం జరుగుతుందా అని, ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది అయితే ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్ తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీకు ఇష్టమైన సినిమాలను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. 

Also Read :  గుడిలో రజనీకాంత్ కు అవమానం.. బిచ్చగాడు అనుకోని ₹10 దానం చేసిన మహిళ.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

Visitors Are Also Reading