Home » పుష్ప,కాంతర చిత్రాలతో ఇండస్ట్రీ నాశనం అవుతోంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

పుష్ప,కాంతర చిత్రాలతో ఇండస్ట్రీ నాశనం అవుతోంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల హవా నడుస్తోంది.. ఇక్కడి నుంచి ఎలాంటి సినిమా అయినా కంటెంట్ ఉంటే చాలు సంచలన విజయాలు అందుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలోనే వచ్చిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచల విజయమందుకుందో మనందరికీ తెలిసిందే.. ఈ చిత్రం తర్వాత పుష్ప మరియు కే జి ఎఫ్ సినిమాలు కూడా భారీగానే వసూలు చేశాయి.. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాంతారా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది.. దీంతో సౌత్ మూవీస్ పై నార్త్ అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.. దీంతో ఫిల్మ్ మేకర్స్ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలు తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నారు..

Advertisement

ALSO READ:భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు రాకుండా ఉండాలంటే ఈ 5 టిప్స్ పాటించండి…!

Advertisement

ఈ విధంగా సౌత్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుంటే బాలీవుడ్ మూవీస్ మాత్రం డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన ఎన్నో సినిమాలు తీవ్రమైన నష్టాలను మిగిల్చాయి.ఇందులో పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన లాల్ సింగ్ చద్దా,బ్రహ్మాస్త్ర వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని చెప్పవచ్చు.. ఈ తరుణంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటయ్యా అంటే సౌత్ సినిమాల వల్లే బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనం అవుతుందని ఆగ్రహాన్ని వెల్లగక్కాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్నది..

దీంతో బాలీవుడ్ సినీ మేకర్స్ కూడా అలాంటి చిత్రాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ప్రయత్నాలు చేయడం వల్లే బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనం అవుతుందని అన్నారు. కాంతారా, కే జి ఎఫ్ వంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయమందుకున్నాయి. కానీ అలాంటి చిత్రాలను కాపీ చేయాలని బీటౌన్ మేకర్స్ ట్రై చేయడం వల్లే నష్టాలు వస్తున్నాయని తెలియజేశారు.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టిపెట్టేది పాన్ ఇండియా సినిమాల పైన కాదు. ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇచ్చే సినిమాలపై దృష్టి పెట్టాలన్నారు. చిన్న సినిమాలు నిర్మిస్తేనే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయని అందరూ అదే ఫాలో కావాలని తెలియజేశారు.

ALSO READ:

Visitors Are Also Reading