సాధారణంగా మనం తినే ఆహారాలు మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఆయుర్వేదం నుండి ఆధునిక వైద్యం వరకు ప్రతీ ఒక్కరు ఏది ఎప్పుడు తినాలి.. ఎప్పుడు తినకూడదో చెబుతుంటారు. రాత్రి సమయంలో కొన్ని ఆహారాలు తినడం వల్ల మీ నిద్ర పై ప్రభావం చూపుతాయని కొన్ని నివేదికలు చెబుతుంటాయి. వాటిని తింటే రాత్రివేళలో నిద్రపోవడం చాలా కష్టమంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో పీడకలలు కూడా వస్తాయట. అవి ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఇలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
జున్ను :
రాత్రి సమయంలో జున్నును అస్సలు తినకూడదట. జున్ను తింటే నిద్రలో అశాంతిని కలిగిస్తుంది. అదేవిధంగా పీడకలలు కూడా వస్తాయని E టైమ్స్ నివేదించింది. బ్రిటీష్ చీజ్ బోర్డు ప్రకారం.. జున్నును ఎలాంటి పరిస్థితిలో కూడా రాత్రి పూట తినకూడదు.
చాక్లెట్ :
డార్క్ చాక్లెట్ లో చాలా కెఫిన్ ఉంటుంది. రాత్రి సమయంలో చాక్లెట్ తింటే ఇది గాఢ నిద్రను నిరోధిస్తుంది. దీంతో పాటు చాక్లెట్ తింటే అది మీకు అశాంతి, పీడకలలను కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
చిప్స్ :
ఫ్రాంటియర్స్ ఆఫ్ సైకాలజీ ప్రకారం.. చిప్స్ వంటి జిడ్డుగల ఆహారాల్లో కనిపించే కొవ్వులు జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. దీంతో రాత్రి నిద్రలో అశాంతి, నిద్ర భంగం, తరుచూ పీడకలలు వస్తుంటాయి.
Advertisement
పెరుగు :
ఆయుర్వేదం ప్రకారం.. రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల శ్లేష్మం ఏర్పుడుతుంది. అదేవిధంగా శ్వాసకోశ వ్యవస్థను అడ్డుకుంటుంది. మెదడుకు వెళ్లే రక్తప్రసరణకు ప్రభావితం చేస్తుంది. దీంతో నిద్రలేమితో పాటు పీడకలలు వచ్చే ప్రమాదముంది.
బ్రెడ్ మరియు పాస్తా :
బ్రెడ్ అండ్ పాస్తాలో చాలా స్టార్చ్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. శరీరంలో ఇవి గ్లూకోజ్ గా మార్చబడుతాయి. చక్కర ఆహారాల మాదిరిగానే ప్రభావం చూపిస్తాయి. వీటి వల్ల నిద్రకు ఆటంకాలు కలగడంతో పాటు పీడకలలు వస్తాయి.
Also Read : బట్టతల ఎందుకు వస్తుంది ? పురుషులకే ఎక్కువగా రావడానికి కారణం ఇదే..!
వేడి సాస్ :
ఎక్కువగా వేడిసాస్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నిద్ర వేగవంతమైన కంటి కదలిక దశలో కలల రూపాన్ని మార్చుతుంది. దీంతో పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి సమయంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం బెటర్.
Also Read : హైదరాబాద్ లో రూపాయికే సినిమా టికెట్.. ఆ ఆఫర్ ఎన్ని రోజులు అంటే ?