Telugu News » Blog » బరువు తగ్గడానికి మీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ప్రోటీన్ పౌడర్ ని ఇలా తయారు చేసుకోండి..!

బరువు తగ్గడానికి మీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ప్రోటీన్ పౌడర్ ని ఇలా తయారు చేసుకోండి..!

by Anji
Ads

సాధారణంగా మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా వరకు డైట్ ఫాలో అయ్యే వారు మార్కెట్ లో లభించే ప్రోటీన్ పౌడర్ పై ఆధారపడుతుంటారు. బరువు తగ్గాలనుకునే వారు బయట మార్కెట్ లో లభించేవి కాకుండా ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ ని తయారు చేసుకుని వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఇంట్లో ఉండే పదార్థాలతో ప్రోటీన్ పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అరకప్పు వాల్ నట్స్, అర కప్పు పిస్తా, అర కప్పు జీడిపప్పులు వేసుకొని చిన్న మంటపై ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్ లో ఒక కప్పు బాదం పప్పులను వేసి వేయించుకోవాలి. ఆ తరువాత రెండు టేబుల్ స్పూన్ల పుచ్చ గింజలు, రెండు టేబుల్ స్పూన్ల పొద్దుతిరుగుడు గింజలు, రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. చివరికీ అర కప్పు ఓట్స్ ను కూడా వేసి ఫ్రై చేయాలి. 

Also Read :  ఆవు పాల కంటే గేదె పాలు తెల్లగా ఎందుకు ఉంటాయో తెలుసా ?

Advertisement

 

 

ఇలా ప్రై చేసుకున్న తరువాత ఒక మిక్సి జార్ తీసుకొని అందులో వేయించి పక్కకు పెట్టుకున్నటువంటి బాదం, పిస్తా, వాల్ నట్స్, జీడిపప్పులు, పుచ్చ గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, ఓట్స్ అన్నింటిని వేసి మెత్తగా మిక్సి పట్టాలి. మిక్సి పట్టిన తరువాత వచ్చిన పొడిని స్ట్రైనర్ సాయంతో జల్లించి దీనికి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ ని కలిపాలి. ఇక ప్రోటీన్ పౌడర్ సిద్ధమైనట్టే.  ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ని రోజుకు ఒక టీ స్పూన్ చొప్పున పాలతో కలిపి తీసుకోవాలి. దీని ద్వారా బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. కేవలం బరువు మాత్రమే తగ్గడం కాదు.. హెయిర్ ఫాల్ సమస్య కూడా దూరమవుతుంది. అదేవిధంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. మెదడు పనితీరు చురుకుగా పని చేస్తుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.   ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంట్లోనే ఈ ప్రోటీన్ పౌడర్ ని తయారు చేసుకొని దాని వల్ల కలిగే లాభాలను పొందండి. 

Advertisement

 Also Read :  బట్టతల ఎందుకు వస్తుంది ? పురుషులకే ఎక్కువగా రావడానికి కారణం ఇదే..!

You may also like