Home » హైదరాబాద్ లో రూపాయికే సినిమా టికెట్.. ఆ ఆఫర్ ఎన్ని రోజులు అంటే ? 

హైదరాబాద్ లో రూపాయికే సినిమా టికెట్.. ఆ ఆఫర్ ఎన్ని రోజులు అంటే ? 

by Anji
Ad

సాధారణంగా ప్రస్తుతం ఒక సినిమాని వీక్షించాలంటే రూ.100 తప్పకుండా సినిమా టికెట్ కి పెట్టాల్సిందే. ఇక మల్టీప్లెక్స్ లలో అయితే 150 రూపాయలు మినిమం పెట్టాల్సిందే. కానీ హైదరాబాద్ మహానగరంలోని ఓ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ కేవలం ఒక్క రూపాయికే టికెట్ ఇస్తుంది. రూపాయికి ఏమి రాని ఈ రోజుల్లో సకల సౌకర్యాలు ఉన్న ఈ థియేటర్ మాత్రం సినిమా టికెట్ ఆఫర్ చేస్తుంది. మౌలాలిలో మూవీ మ్యాక్స్ ఏఎంఆర్ పేరుతో ఓ కొత్త మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పాటు అయింది. డిసెంబర్ 15న గ్రాండ్ గా ఈ థియేటర్ ని ప్రారంభించనున్నారు. 

Advertisement

ఈ థియేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా డిసెంబర్ 15న కేవలం ఒక్క రూపాయికే సినిమా టికెట్లను ఇవ్వనున్నారు. డిసెంబర్ 15న మూవీ మ్యాక్స్ థియేటర్ లో 11 సినిమాలు ప్రదర్శనకు ఉన్నాయి. తెలుగుతో పాటు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. మూవీ మ్యాక్స్ ప్రారంభోత్సవ ఆఫర్ కింద అక్కడ ఆ రోజు ఏ సినిమా చూసినా కేవలం రూపాయి మాత్రమే తీసుకుంటారు. ఇక ఆన్ లైన్ లో కూడా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, బుక్ మై షోలలో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.  

Advertisement

Also Read :  కాంతార సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా ?

ప్రస్తుతం మూవీ మ్యాక్స్ మల్టీప్లెక్స్ లో యశోద, మసూద, లవ్ టుడే, గుర్తుందా శీతాకాలం, చెప్పాలని ఉంది, హిట్ 2, పంచతంత్రం,ఊంచాయి, దృశ్యం2, కాంతార, భేడియా సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఆన్ లైన్ లో పొందవచ్చు. ఆన్ లైన్ లో రూపాయి టిెకెట్లు అందుబాటులో ఉండడంతో జనాలు ఎగబడ్డారు. ఒక్కసారిగా ట్రాఫిక్ పెరగడంతో సర్వర్ డౌన్ అయింది. ఇక ఆ తరువాత టికెట్లు బుక్ అయ్యాయి. మరో విశేషం ఏంటంటే.. మూవీ మ్యాక్స్ థియేటర్ లో డిసెంబర్ 15న ఉన్న అన్ని సినిమాలకు టికెట్లు దాదాపు బుక్ అయ్యాయి. కేవలం కాంతార, యశోద చిత్రాలకు కొన్ని టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా సినిమాలన్నింటికీ హౌస్ పుల్ కావడం విశేషం. 

 Also Read :   వారీసు వివాదంపై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు.. వాటిని ఎవడు ఆపలేరు !

Visitors Are Also Reading