Home » వేసవిలో ఆరోగ్యం కోసం ఈ పండ్లను తీసుకోండి…!

వేసవిలో ఆరోగ్యం కోసం ఈ పండ్లను తీసుకోండి…!

by AJAY
Published: Last Updated on
Ad

ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడి ప్రతాపం కూడా మొదలయ్యింది. చాలా ప్రాంతాల్లో ఎండలు 40 డిగ్రీల ఓష్ణోగ్రత దాటేసాయి. అయితే ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న సంగతి తెలిసిందే. కాస్త అజాగ్రత్త గా ఉన్న ఎండలకు అనారోగ్యం భారిన పడక తప్పదు. ముఖ్యంగా ఎండాకాలం శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

Advertisement

అయితే తరచూ నీటిని తాగడం కాస్త ఇబ్బందిగా నే అనిపిస్తుంది. కాబట్టి శరీరంలో నీటి శాతం ఉండేలా ఆహారం కూడా తీసుకోవాలి. ఇక శరీరం లో నీటి శాతం పెరిగే ఆహారాలు అంటే పండ్లు మాత్రమే అని చెప్పాలి. కాబట్టి ఎండాకాలంలో డీహైడ్రేషన్ భారిన పడకుండా ఎక్కువగా పండ్లను తినాలి.

Advertisement

వేసవిలో ఎక్కువగా దొరికే పండు పుచ్చకాయ….దీన్నే తెలంగాణ లో ఖరబుజ అని కూడా అంటారు. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమ్మర్ లో తప్పకుండా తినాలి. అంతే కాకుండా స్ట్రాబెర్రీ మరియు ఖర్జూర పండ్లను మరియు టమాటా లను కూడా తీసుకోవడం మంచింది.

వీటిలో కూడా నీటి శాతం అధికంగా ఉండి డీ హైడ్రేషన్ కు గురి అవ్వకుండా కాపాడుతాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ లు ,ఫైబర్ లు, మినరల్స్ లాంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఈ పండ్లతో పాటు శరీరానికి సరిపడా నీటిని కూడా తాగటం అలవాటు చేసుకోవాలి.

Visitors Are Also Reading