Home » ఆ స్టార్ హీరోతో నిర్మాత డివివి దానయ్య విభేదాలు.. ప్రాజెక్ట్ కి బ్రేక్..!

ఆ స్టార్ హీరోతో నిర్మాత డివివి దానయ్య విభేదాలు.. ప్రాజెక్ట్ కి బ్రేక్..!

by Sravya
Ad

ప్రొడ్యూసర్ దానయ్య గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. క్రేజీ ప్రాజెక్ట్లతో ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటారు తాజాగా స్టార్ హీరో తో డైరెక్టర్ విషయంలో జరిగిన గొడవ కారణంగా దానయ్య చేయబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి బ్రేక్ పడిందని గుసగుసలు అయితే వినపడుతున్నాయి. దానయ్య హీరో మధ్య గొడవకి డైరెక్టర్ ఎలా కారణమయ్యాడు ఇంతకీ ఆ ప్రాజెక్టుకి బ్రేక్ ఎందుకు పడింది..? ఈ విషయాల గురించి ఇప్పుడు చూసేద్దాం. ఆర్ఆర్ఆర్ మూవీ తో ఆస్కార్ అవార్డుని అందుకున్న దానయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ తో దానయ్య చేయబోతున్న ప్రాజెక్టు గురించి పాన్ ఇండియా సినీప్రియులందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్ చేయబోయే ఆఖరి మూవీ ఇదే అనే ప్రచారం కూడా జరుగుతోంది.

Advertisement

Also read:

దానయ్య నిర్మతగా విజయ్ హీరోగా ప్రాజెక్టు కన్ఫర్మ్ అయిపోయింది కానీ డైరెక్టర్ గురించి వేట మాత్రం చాలా రోజుల నుండి కంటిన్యూ అవుతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ గోట్ మూవీ కూడా చేస్తున్నాడు. టైం ట్రావెలింగ్ కోసం ఈ సినిమా రాబోతోంది జూన్లో సినిమా రిలీజ్ అవ్వాలని చూస్తున్నారు జై దానయ్య సినిమాని పట్టాలెక్కించబోతున్నారని టాకు. హఠాత్తుగా సినిమా ఆగిపోయింది అందుకు కారణం కొంతమంది నిర్మాత అంటుంటే డైరెక్టర్ అని కొంతమంది అంటున్నారు. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తాడని రూమర్స్ వస్తున్నాయి. ఖాకి వంటి సినిమాలు రూపొందించిన డైరెక్టర్ హెచ్ వినోద్ పేరు కూడా వినపడుతోంది.

Advertisement

Also read:

ఈ సినిమా కోసం విజయ్ 250 కోట్లు రెమ్యూనిరేషన్ డిమాండ్ చేశారు విజయ్ కి సౌత్ లో ఉన్న మార్కెట్ దృష్టిలో పెట్టుకుని దానయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వినోద్ కి కోలీవుడ్ లో తప్ప మిగిలిన భాషల్లో పెద్దగా మార్కెట్ లేదు అందుకని 400 కోట్ల పెట్టలేనని వినోద్తో మూవీ చూస్తే బిజినెస్ వర్కౌట్ అవ్వదని అన్నారు విజయ్ మాత్రం వినోద్ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారు ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కిస్తే తెలుగు మార్కెట్ కి ఏ సమస్య ఉండదు తమిళం విషయానికి వస్తే అక్కడ విజయ్ కి ఎలానో మంచి మార్కెట్ ఉంటుంది కనుక డైరెక్టర్ ఎవరైనా ఇబ్బంది ఉండదు అని దాని అనుకుంటున్నారు అయితే ఈ ప్రాజెక్టు డీల్ ని కుదర్చలేదని దానయ్య చేతులెత్తేసారని ప్రచారం సాగుతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading