ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ ప్రకటన చేశారు. ఈరోజు మంత్రి బొత్స డిఎస్సి నోటిఫికేషన్, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి తదితర అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు.
read also : Nayanatara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార రిలేషన్ షిప్ !
Advertisement
డిఎస్సీ నోటిఫికేషన్ కచ్చితంగా ఇస్తామన్నారు. మంత్రి ఇంకా ఈ విధంగా మాట్లాడారు. ‘సీఎం జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటానన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించాం. త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటాం. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
Advertisement
read also : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!
ఇందుకోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నాం. కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కూడా పరిశీలిస్తున్నాం. సీఎం జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులకు రాగిజావ నిలిపివేశామని వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం పాఠశాలల్లో పరీక్షలు, ఒంటిపూట బడులు జరుగుతున్నాయి. అందువల్లనే చిక్కిలు ఇస్తున్నామన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
read also : 5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!