Home » నలుపు రంగు దుస్తులు వేసుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే..!!

నలుపు రంగు దుస్తులు వేసుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే..!!

Ad

హిందూ సంప్రదాయం ప్రకారం నలుపు రంగును అశుభానికి ప్రతీకగా భావిస్తారు. కొంతమంది దృష్టిని నివారించడానికి నలుపును ఉపయోగిస్తారు. అయితే ఇంట్లో ఏ ప్రదేశాల్లో నలుపు రంగును దూరంగా ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. నలుపు రంగు గురించి ప్రజల మనసుల్లో ప్రత్యేకమైన భావాలు ఉంటాయి. అందువల్ల వీలైనంత వరకు నలుపును దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో నలుపు రంగును అస్సలు ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగించినట్లయితే అనవసర నష్టాలు సంభవిస్తాయి. పిల్లల పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగును వాడవద్దు.

వీలైనంత వరకు నలుపు రంగుతో ఉండే ఫర్నిచర్ ను కూడా నివారించాలి. ఈ కలర్ పిల్లల పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే నలుపురంగును వంటగదిలో కూడా ఉపయోగించకూడదు. ముఖ్యంగా కిచెన్ పైభాగంలో అస్సలు ఉపయోగించకూడదు. ఒక వేళ నలుపురంగు ఇటుకలను ఉపయోగించినట్లయితే దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని తగ్గించుకోవాలంటే వంటగది లేదా గ్యాస్ స్టవ్ కింద ఫ్లోర్ ని లైట్ కలర్ టైల్స్ వేయాలి. ఇలా వేయడం ద్వారా వంటగదికి సంబంధించిన దుష్ప్రభావాలు దూరమవుతాయి. అవసరమనుకుంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద నల్ల దారాన్ని కట్టొచ్చు.

Advertisement

Advertisement

నలుపు రంగు బొట్టు కూడా పెట్టొచ్చు. దుష్టశక్తులను నివారించడానికి నలుపు ను ఉపయోగిస్తారు. ఇది అన్ని రకాల ప్రతికూల శక్తుల్ని తిరిగి పంపుతుంది. అందువల్ల ఇంటి లోపల ఉన్న వస్తువుల్లో దీన్ని ఉపయోగించడం సరైనదిగా పరిగణిస్తారు. నలుపు ను వేడి గ్రహించేదిగా పరిగణిస్తారు. నలుపు రంగు దారం లేదా దుస్తులను ధరించినప్పుడు ఎదుటి వారి దృష్టి ద్వారా ఉత్పన్నమయ్యే ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని చెబుతారు. అందుకే నలుపు రంగు దారం, బట్టలు, బొట్టు ధరిస్తారు. ఇంట్లో ఏదైనా పూజ చేసుకునే టప్పుడు మాత్రం నలుపు రంగు బట్టలను ధరించ కూడదు.

ALSO READ;

F3 ట్రైల‌ర్ విడుద‌ల‌.. చూస్తే మాత్రం న‌వ్వు ఆపుకోలేరు..!

బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి ఇండ‌స్ట్రీని ఏలుతున్న 6గురు స్టార్ హీరోలు వీరే..!

 

Visitors Are Also Reading