Home » F3 ట్రైల‌ర్ విడుద‌ల‌.. చూస్తే మాత్రం న‌వ్వు ఆపుకోలేరు..!

F3 ట్రైల‌ర్ విడుద‌ల‌.. చూస్తే మాత్రం న‌వ్వు ఆపుకోలేరు..!

by Anji
Ad

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఎఫ్‌3. టాలీవుడ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన సినిమాల‌న్ని హిట్ టాక్ పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈచిత్రంలో హీరోయిన్లుగా త‌మ‌న్నా, మెహ్రిన్ లు న‌టిస్తున్నారు. ఇక తాజాగా చిత్ర బృందం ఎఫ్‌3 ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. 2019 సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన ఎఫ్‌2 మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మే 27న విడుద‌ల‌వ్వ‌నుంది. శ్రీ‌వేంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ముఖ్యంగా దాదాపు 2.35 నిమిషాల నిడివి గ‌ల ఈ ట్రైల‌ర్ ఆద్యంతం న‌వ్వులు పూయిస్తుంది. లోకంలో పంచ‌భూతాలు అంద‌రికీ తెలిసే ఉంటాయి. తెలియని ఒక భూతం ఉంది. అదే డ‌బ్బు అని ముర‌ళీ శ‌ర్మ వాయిస్ ఓవ‌ర్‌తో ఈ ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది. డ‌బ్బున్న వాడికి ఫ‌న్‌.. లేని వాడికి ఫస్ట్రేష‌న్ అంటూ ముర‌ళీ శ‌ర్మ కోటిశ్వ‌రునిగా క‌నిపించ‌నున్నాడు. అటు హీరోల్లో వెంక‌టేష్ రే చీక‌టి, వ‌రుణ్ తేజ్ న‌త్తితో బాద‌ప‌డుతుంటారు. వాళ్ల‌ది మ‌రాఠీ ఫ్యామిలీ అయితే మాది ద‌గ్గుబాటి ఫ్యామిలీ అని వెంకీ చేసిన కామెడీ బాగుంటుంది. అదేవిధంగా సూప‌ర్ హిట్‌గా నిలిచిన ఎఫ్‌-2 సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందించింది.

Advertisement

Advertisement

తొలిభాగంలో ఫ్యామిలీతో క‌లిగే ఫ‌స్ట్రేష‌న్ చూపించ‌గా.. ఈసారి మ‌నీతో మ‌నుషుల‌కు క‌లిగే ఫ్ట్రేష‌న్‌ను ఎఫ్‌-3 ద్వ‌రా చూపించ‌నున్నారు. ముఖ్యంగా వీళ్ల పాత్ర‌ల నుంచి ఫ‌న్‌ను క్రియేట్ చేయ‌డంతో పాటు డ‌బ్బు, బంగారం అని ఆశ‌ప‌డే వారి భార్య‌ల వ‌ల్ల హీరోలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నారో ఈ చిత్రం ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి చూపించ‌బోతున్నారు. ఇక రాజేంద్ర‌ప్ర‌సాద్, సునీల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. ఎఫ్‌2 క‌నిపించిన ప్ర‌గ‌తి, వై.విజ‌య‌, అన్న‌పూర్ణ‌మ్మ‌, ర‌ఘుబాబు పాత్ర‌లు సీక్వెల్‌లో క‌నిపిస్తున్నాయి. ఇక మ‌రొక వైపు పూజాహెగ్దే ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, మేకింగ్ వీడియోలు సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచాయి.

Also Read : 

ఈ స్టార్ హీరోలు,హీరోయిన్లు పెళ్లి ఎందుకు చేసుకోవడంలేదో నిజాలు బయట పెట్టిన వేణు స్వామి..!!

‘సీతా రామం’ సినిమా విడుద‌ల అప్పుడేనా..?

 

Visitors Are Also Reading