ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాకుండా ఎక్కడ చూసిన నరేష్-పవిత్ర బంధం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ఇప్పుడు నాలుగవ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు రాగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. సీనియర్ నటి పవిత్ర లోకేష్, నరేష్‌ల మధ్య ఎఫైర్ ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించిన విషయం విధితమే.ఓ కన్నడ మీడియా ఛానల్ వారిరువురు కలిసి సహజీవనం చేస్తున్నట్టు వెల్లడించింది.
ఇక నరేష్ భార్య రమ్య రఘుపతి ముందుకొచ్చి నాకు నరేష్‌కు ఇంకా విడాకులు తీసుకోలేదని.. పవిత్ర మా మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపణలు చేసింది. నరేష్ వద్ద నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేదని ఆరోపించింది. నెటిజన్లు అసలు రమ్య ఎవరూ అని ఆరా తీయడం ప్రారంభించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి , రమ్య తండ్రి వరుసకు సోదరులు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రమ్య కు వరుసకు అన్న అవుతాడు.
Advertisement
Advertisement
ఇక ఎప్పుడో రమ్య కుటుంబం బెంగళూరు వలస వెళ్లిపోయింది. బెంగళూరులో ఫేమస్ హోటల్ మోతి మహల్ హోటల్ . ముఖ్యంగా నరేష్ తనను బెదిరించి విడాకులకు ఒప్పించారని.. సంవత్సరం పాటు తనను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన తరువాత వీరిద్దరి మధ్య మనస్పార్థాల కారణంగా దూరంగా ఉంటున్నారు. తాజాగా నరేష్ పవిత్రను పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు విని రమ్య రఘుపతి స్పందించారు. నరేష్ తనకు విడాకులు ఇవ్వలేదని.. ఇప్పటికీ నేను తన భార్యనే అని చెప్పారు. దీనిపై నరేష్ ఆమె ప్రవర్తన బాగాలేదని, ఆమె నచ్చకనే నేను దూరంగా ఉంటున్నట్టు తనదైన శైలిలో కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. నరేష్-పవిత్ర బంధం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. వీరు పెళ్లి చేసుకుంటారా లేక సహజీవనంతోనే కాలం గడుపుతారా అనేది చూడాలి మరి.
ALso Read :
రెక్కీ 360 టీజర్ మీరు చూశారా..? ఎలా ఉందంటే..?
నాని రెమ్యునరేషన్ లో భారీ నిర్ణయం… దసరా సినిమాకు…?