Telugu News » Blog » నాని రెమ్యునరేషన్ లో భారీ నిర్ణయం… దసరా సినిమాకు…?

నాని రెమ్యునరేషన్ లో భారీ నిర్ణయం… దసరా సినిమాకు…?

by Manohar Reddy Mano
Ads
ప్రస్తుతం ఇండియా సినిమాలో మన టాలీవుడ్ దే హావ నడుస్తుంది అనేది నిజం. అందుకే టాలీవుడ్ హీరోలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. అయితే మన తెలుగులో ఇప్పుడు ఒక్కో హీరో తీసుకునే రెమ్యునరేషన్ అనేది చూస్తే.. అది ఏ బాలీవుడ్ హీరో తీసుకునేదానికి తక్కువగా ఉండదు. ఇక ఓ సినిమా భారీ హిట్ అయితే మాత్రం.. ఆ హీరో తన రెమ్యునరేషన్ ను పెంచడం అనేది మాములు విషయమే. కానీ ఈ మధ్యలో మన తెలుగులో మాత్రం ఓ కొత్త ట్రెండ్ అనేది నడుస్తుంది. అదేంటంటే పెద్ద హీరోలు ఎవరు ఈ రెమ్యునరేషన్ పై ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు.
అయితే ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య పెద్ద డిజాస్టర్ అయిన విషయం అందరికి తెలిసిందే. మొదటి రోజు ఈ డిజాస్టర్ టాక్ చిరంజీవి, రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ అనేది వెన్నకి ఇచ్చేసారు. ఆ తర్వాత దర్శకుడు కొరటాల శివ కూడా తన రెమ్యునరేషన్ అనేది నిర్మాతకు తిరిగి ఇచ్చేసాడు. ముందు ముందు ఈ సినిమాకు లాభాలు వస్తే అప్పుడు రెమ్యునరేషన్ అనేది తీసుకుంటాం అని తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు నాచురల్ స్టార్ నాని కూడా ఇదే పని చేసినట్లు తెలుస్తుంది.
నాని ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కేక్కిస్తున్నా సినిమా దసరా. ఇక ఈ మధ్య ఈ సినిమా బడ్జెట్ లో సమస్యలు వచ్చాయి అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాని తన రెమ్యునరేషన్ లో సగం వెన్నకి ఇచ్చి.. సినిమా నిర్మించడంలో దీనిని ఉపయోగించాలని సూచించినట్లు తెలుస్తుంది. ఇక నాని కూడా చిరంజీవి మాదిరే.. సినిమా విడుదల అయ్యి లాభాలు వచ్చిన తర్వాతే తన డబ్బులను తీసుకుంటాను అని చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తలే సోషల్ మీడియాలో బాగా చెక్కర్లు కొడుతున్నాయి.