మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ సినీ రంగంలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత సినిమా చిరంజీవి లక్కీడేట్ రోజునే విడుదలైంది. గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదే రోజున జరగడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా రామ్ చిరుతగా అడుగుపెట్టి.. ఆ తరువాత మగధీరతో టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసి చరిత్ర సృష్టించాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు చిరుతగా అడుగుపెట్టిన రామ్‌చరణ్ 15 ఏళ్ల నటప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
Advertisement
రామ్ చరణ్ చిరుత సెప్టెంబర్ 27, 2007లో విడుదలైంది. చిరంజీవికి ఈ రోజు వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఇదే తేదీన సరిగగ్గా 32 ఏళ్ల కిందట చిరంజీవి హిందీలో తొలిసారి నటించిన ప్రతిబంధ్ సినిమా సెప్టెంబర్ 28, 1990న విడుదల అయింది. మొదటిసారి బాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టి విజయాన్ని అందుకున్నారు చిరంజీవి. రవిరాజ పినిశెట్టి-చిరు కాంబోలో వచ్చిన నాలుగవ చిత్రం ప్రతిబంధ్. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన అంశం సినిమాకు హిందీ రీమెక్. దర్శకుడిగా రవిరాజా పనిశెట్టి చిరంజీవి హీరోగా హిందీ ఫస్ట్ మూవీ ఇది. తన తొలి చిత్రంతోనే హిందీలో సక్సెస్ సాధించారు చిరంజీవి. నిర్మాతగా అల్లు అరవింద్‌కు తొలి బాలీవుడ్ మూవీ కావడం విశేషం. ఈ సినిమాతో రాంరెడ్డి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు.
Advertisement
Also Read : త్వరలో అనుష్క పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవరంటే..?
చిరంజీవి హిందీలో తొలి చిత్రం విడుదలైన రోజున రామ్ చరణ్ తొలి సినిమా చిరుతను విడుదల చేయడం విశేషం. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నిర్మాత సి.అశ్వనిదత్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. నేహా శర్మ కథానాయికగా నటించింది. ఈ చిత్రం మ్యూజికల్‌గా సూపర్ హిట్ సాధించింది. తొలి సినిమా చిరుతతో తండ్రికి తగ్గ తనయుడిగా డ్యాన్స్‌ల్లో, ఫైట్స్ లో చిరంజీవి నట వారసుడు అనిపించుకున్నారు. ఇక ఈ సినిమా పూరిజగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కావడం విశేషం. తండ్రి చిరంజీవికి కలిసి వచ్చిన రోజునే రామ్ చరణ్ తన తొలి సినిమాను విడుదల చేయడం విశేషం. తాజాగా అదే రోజు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం మరో విశేషం. మొత్తానికి సెప్టెంబర్ 28 మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లకు ప్రత్యేకమనే చెప్పాలి.
Also Read : ఆ ఫ్యామిలీ ఫంక్షన్ లో తారకరత్న ఎన్టీఆర్ ను అవమానించాడా…? ఆ రోజు ఏం జరిగింది..?