Home » ఆ ఫ్యామిలీ ఫంక్ష‌న్ లో తార‌క‌ర‌త్న ఎన్టీఆర్ ను అవ‌మానించాడా…? ఆ రోజు ఏం జ‌రిగింది..?

ఆ ఫ్యామిలీ ఫంక్ష‌న్ లో తార‌క‌ర‌త్న ఎన్టీఆర్ ను అవ‌మానించాడా…? ఆ రోజు ఏం జ‌రిగింది..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోల లిస్టులో జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఒక‌రు. రీసెంట్ గా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియాకు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా త‌ర‌వాత ప్రశాంత్ నీల్ తో మ‌రో పాన్ ఇండియా సినిమా చేయ‌బోతున్నాడు. ఇక ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాలో బొద్దుగా క‌నిపించినా కూడా డ్యాన్స్ లు ఫైట్ ల‌తో ప్రేక్షకుల‌ను అల‌రించాడు. ఇక ఆది సినిమాతో తాత‌కు త‌గ్గ మ‌న‌వడు అనిపించుకున్నాడు. వ‌రుస హిట్ ల‌తో ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగాడు. అంతే కాకుండా నంద‌మూరి ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన హీరోల‌లో ఎన్టీఆర్ త‌ర‌వాత త‌రంలో బాల‌య్య ఆ త‌ర‌వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ కే ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.

tarakaratna

Advertisement

అయితే నంద‌మూరి ఫ్యామిలీతో ఎన్టీఆర్ కు గొడ‌వ‌లు ఉన్నాయ‌నే వార్త‌లు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. నంద‌మూరి ఫ్యామిలీలో ఓ ఫ్యామిలీ ఫంక్ష‌న్ జ‌ర‌గ్గా ఎన్టీఆర్ త‌న తండ్రి హ‌రికృష్ణ ద్వారా వెళ్లార‌ట‌. అయితే ఆ ఫంక్ష‌న్ లో ఎన్టీఆర్ బాబాయి బాల‌కృష్ణ హీరో తార‌క‌ర‌త్న‌ను పుర‌మాయించి ప‌నిగ‌ట్టుకుని ఎన్టీఆర్ ను అవ‌మానించార‌ట‌. అయితే ఈ విష‌యం పై తార‌క‌ర‌త్న ఓ ఇంట‌ర్య్వూలో క్లారిటీ ఇచ్చారు.

తాను ఎన్టీఆర్ ను అవ‌మానించారని అంటారు కానీ అలా చేయ‌లేద‌ని చెప్పాడు. ఎన్టీఆర్ ను అవ‌మానించాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని అది వ‌ట్టిపుకార్ అని అన్నారు. తార‌కర‌త్న క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఈ వార్త‌లు మాత్రం ఎప్పుడూ వైర‌ల్ అవుతూనే ఉంటాయి. మ‌రోవైపు ఎన్టీఆర్ బాల‌య్య ప‌లు సినిమా ఫంక్ష‌న్ ల‌లో సందడి చేసిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా క‌ల్యాణ్ రామ్ ఎన్టీఆర్ తో సినిమాలు నిర్మిస్తూ త‌మ్మ‌డి స‌పోర్ట్ కూడా తీసుకుంటున్నారు.

Visitors Are Also Reading