Telugu News » Blog » త్వ‌ర‌లో అనుష్క పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవ‌రంటే..?

త్వ‌ర‌లో అనుష్క పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవ‌రంటే..?

by Anji
Ads

టాలీవుడ్ అగ్ర‌హీరోయిన్‌ల‌లో అనుష్క శెట్టి ఒక‌రు. నాగార్జున సూప‌ర్ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన అనుష్క ఆ త‌రువాత అరుంధ‌తి సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. బాహుబ‌లి సినిమా ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటేడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన స్టార్ బ్యూటీ నిశ్చ‌బ్దం సినిమా త‌రువాత మ‌రో సినిమా చేయ‌లేదు. దాదాపు మూడేళ్ల త‌రువాత ఆమె సినిమా చేయ‌డానికి సిద్ధమైంది. మ‌రోవైపు 40 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు దాటిన‌ప్ప‌టికీ ఈమె మాత్రం పెళ్లి ఊసే లేదు.

Advertisement

Also Read : అల్లు అర్జున్‌, అల్లు శిరీష్ గొడ‌వ ప‌డ్డారా..?

గ‌త కాలం నుంచి అనుష్క శెట్టి హీరో ప్ర‌భాస్ ప్రేమ‌లో ప‌డింద‌ని, త్వ‌ర‌లోనే వీరు పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల ముందు తామిద్ద‌రం ఫ్రెండ్స్ అంటూ ప్ర‌భాస్, అనుష్క ఖండించిన‌ప్ప‌టికీ ఈ వార్త‌ల‌కు మాత్రం బ్రేక్ ప‌డ‌లేదు. ఇటీవ‌ల ప్ర‌భాస్ పెద్ద‌నాన్న కృష్ణంరాజు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంద‌ర్భంలో ఆయ‌న‌ను క‌లిసేందుకు వెళ్ల‌డంతో వీరి పెళ్లి మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది.

Advertisement

Also Read : మ‌హేష్ బాబుకి మాతృ వియోగం

తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించిన మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అనుష్క త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనుంద‌ని.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌తో అనుష్క పెళ్లి జ‌రుగుతుంద‌ని స‌మాచారం. ఒక‌వేళ ఇది క‌నుక వాస్త‌వం అయితే ప్ర‌భాస్ ఫ్యాన్స్ అనుకోని షాక్ ఇచ్చిన‌ట్టే. సిల్వ‌ర్ స్క్రీన్ పై జంట‌గా అల‌రించిన ఈ జంట రియ‌ల్ లైఫ్‌లో కూడా ఒక్క‌ట‌వుతార‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనుష్క మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటే మాత్రం డార్లింగ్ అభిమానులు హ‌ర్ట్ అవుతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Also Read : దేవిపుత్రుడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏ చేస్తుందంటే..?