సాధారణంగా ఒక సినిమాకి హీరో, హీరోయిన్ ఎంత ముఖ్యమో కమెడీయన్ కూడా అంతే ముఖ్యం. టాలీవుడ్ కమెడీయన్స్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో బ్రహ్మనందం ఒకరు. వందలాది సినిమాల్లో కమెడియన్ గా నటించిన బ్రహ్మనందం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఇలా సినిమాల పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్రహ్మానందం వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఈయనకు ఇద్దరు కుమారులు అనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే.
Advertisement
పెద్ద కుమారుడు గౌతమ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. రెండో కుమారుడు సిద్దార్థ్ గత కొద్ది రోజుల కిందటే నిశ్శితార్థం చేసుకున్నారు. ఉద్యోగ రిత్యా విదేశాల్లో స్థిరపడ్డారు. ఐశ్వర్య అనే అమ్మాయిని సిద్ధార్థ్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. హైదరాబాద్ లోనే తన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వీరిద్దరికీ పెద్దలు నిశ్చయించిన వివాహం జరుగుతుంది. బ్రహ్మానందం కుమారుడి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Advertisement
మరోవైపు బ్రహ్మానందం కి కాబోయే కోడలు ఎవరు ? తన బ్యాగ్రౌండ్ ఏంటి ? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈమె ప్రముఖ డాక్టర్ పద్మజా విజయ్ కుమార్తె అని తెలుస్తోంది. కరీంనగర్ లో పద్మజా సంతాన సాఫల్య కేంద్రం ఉంది. ఐశ్వర్య కూడా తల్లిబాటలోనే డాక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈమె కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఐశ్వర్య ఒక్కతే కూతురు కావడంతో ఈమె పేరిట ఆస్తులు భారీగానే కూడపెట్టినట్టు సమాచారం. మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని బ్రహ్మనందం కోడలుగా చేసుకోబోతున్నారు. అతి త్వరలోనే వీరి పెళ్లి జరుగబోతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రాజీవ్ గాంధీ చనిపోకుంటే సూపర్ కృష్ణ సీఎం అయ్యేవారా ? వారి మధ్య ఉన్న అనుబంధం ఏంటి ?
మీ భార్యలో ఈ ఒక్క లక్షణం కనిపించిందంటే మరొకరితో రిలేషన్ లో ఉన్నట్టే..?