Home » రాజీవ్ గాంధీ చనిపోకుంటే సూపర్ కృష్ణ సీఎం అయ్యేవారా ? వారి మధ్య ఉన్న అనుబంధం ఏంటి ?

రాజీవ్ గాంధీ చనిపోకుంటే సూపర్ కృష్ణ సీఎం అయ్యేవారా ? వారి మధ్య ఉన్న అనుబంధం ఏంటి ?

by Anji
Published: Last Updated on
Ad

భారతదేశ సినీ చరిత్రలో కొన్ని మరుపురాని సంఘటనలు చోటు చేసుకున్నాయి. సినీ పరిశ్రమ కూడా అన్ని రంగాలలో విస్తరించడం ప్రారంభమైన రోజులు అవి. సినీ ఇండస్ట్రీకి, రాజకీయాలకు విదీయలేని అనుబంధముంది. ఎంజీఆర్, ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వరకు రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన వారే. ఎన్టీఆర్ ప్రభంజనంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ పరిపాలనలో దూసుకెళ్తోంది.

ఈ క్రమంలో అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో ఎన్టీఆర్ ని అప్పట్లో ఢీ కొట్టింది మాత్రం ఘట్టమనేని కృష్ణ అనే చెప్పాలి. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారాన్ని చేజెక్కించుకున్న నాదెండ్ల భాస్కర్ రావుకు అనుకూలంగా పెద్ద పేజీలో ప్రకటన విడుదల చేశారు. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణ పేరు మారుమ్రోగిపోయింది. రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణకి ఉన్న సంబంధం ఏంటి ? ఏలూరు ఎంపీగా అంత మెజార్టీతో ఎలా గెలిచారు.? రాజీవ్ గాంధీ ఉంటే కృష్ణ సీఎం అయ్యేవారా ? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

krishna-and-rajeev-gandhi

 

చాలా మందికీ సూపర్ స్టార్  ఓ సినీ ప్రేమికుడిగా తెలుగు ఇండస్ట్రీని కొత్త పథంలో నడిపిన దర్శకునిగా మాత్రమే తెలుసు. కానీ  చాలా మందికి తెలియని కోణం కృష్ణ రాజకీయ ప్రస్థానం. ఇందిరా గాంధీ మరణించినప్పుడు ఆమె అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఇదే కృష్ణ రాజకీయ భవిష్యత్ కి పునాదులు వేసిన ఘటన అనే చెప్పుకోవచ్చు. ఇందిరా గాంధీ అంత్యక్రియల నుంచే రాజీవ్ గాంధీతో కృష్ణకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరు మంచి స్నేహితులుగా మారారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతగా బాగాలేదు.

ఎన్టీఆర్ ప్రభంజనంతో రాష్ట్రం ఊగిపోతుంది. దీంతో ఎన్టీఆర్ కి ధీటు అయిన వారి కోసం వెతకడం కోసం ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ.  ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాగేసుకున్న నాదెండ్ల మనోహర్ రావుకు అనుకూలంగా ఓ ప్రకటన విడుదల చేశారు కృష్ణ. అప్పట్లో ఈ సంఘటన సంచలనం అనే చెప్పాలి. అలా వారికి కనిపించిన ఏకైక వీరుడు సూపర్ స్టార్ కృష్ణ. రాజీవ్ గాంధీకి కృష్ణ పై ఉన్న అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాడు.

Advertisement

దీంతో రాజీవ్ మాట కాదనలేకపోయాడు కృష్ణ. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరారు కృష్ణ.  ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. 1989లో ఎంపీ టికెట్ పిలిచి మరీ ఇచ్చింది కాంగ్రెస్. ఏలూరు లోక్ సభ నుంచి పోటీ చేసిన కృష్ణ 71వేల మెజార్టీతో గెలిచారు. దీంతో ఇటు రాష్ట్రంతో పాటు అటు ఢిల్లీలో కూడా సూపర్ స్టార్ కృష్ణ పేరు మారుమ్రోగిపోయింది. ఏపీలో ఎన్టీఆర్ ని ఎదుర్కునే నాయకులు కృష్ణ అని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. దీంతో కాంగ్రెస్ తరుపున సీఎంగా కృష్ణ బరిలోకి దిగుతాడని ప్రచారం కూడా జరిగింది. కానీ అకస్మాత్తుగా రాజీవ్ గాంధీ మరణించడంతో కృష్ణ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

రాజీవ్ గాంధీ మరణంతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసిన కృష్ణ ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఇక అప్పటి నుంచి రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు కృష్ణ. దివంగత  ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ సున్నతంగా తిరస్కరించారు.   రాజీవ్ గాంధీ బతికి ఉంటే.. మాత్రం కచ్చితంగా సూపర్ స్టార్ ముఖ్యమంత్రి అయ్యేవారని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు, కృష్ణ అభిమానులు చాలా  సందర్భాల్లో చెప్పడం విశేషం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మీ భార్యలో ఈ ఒక్క లక్షణం కనిపించిందంటే మరొకరితో రిలేషన్ లో ఉన్నట్టే..?

రెజ్లర్లకు మద్దతుగా నిలుస్తున్న క్రికెటర్లు.. అలాంటి పని చేయొద్దంటూ..?

 నీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూసా… సమంత… అదిరిపోయే రిప్లై ఇచ్చిన విజయ్..!

Visitors Are Also Reading