Home » మీ శ‌రీరం, నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుందా..? ఇలా చేస్తే మ‌టుమాయం..!

మీ శ‌రీరం, నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుందా..? ఇలా చేస్తే మ‌టుమాయం..!

by Anji
Published: Last Updated on
Ad

చెమ‌ట కార‌ణంగా శ‌రీరం నుంచి దుర్వాస‌న వ‌స్తుంది. ఇది మీ శ‌రీర ఉష్ణోగ్ర‌తను నియంత్రించ‌డంలో స‌హాయ‌ప‌డే స‌హ‌జ ప్ర‌క్రియ‌. శ‌రీరంలో ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య ఉన్నా నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుంది. ఉద‌ర స‌మ‌స్య‌లు, అజీర్ణం, డ‌యాబెటిస్‌, ప‌లు స‌మ‌స్య‌ల కార‌ణంగా నోటి నుంచి వాస‌న వ‌స్తుంటుంది.

ఇవి కూడా చదవండి:  మీరు నీళ్లు త‌క్కువ‌గా తాగుతున్నారా..? అయితే మీకు ఈ ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Advertisement

శ‌రీరం దుర్వాస‌న‌కు కొంత‌మంది పెర్ప్యూమ్ ఉప‌యోగించి క‌వ‌ర్ చేస్తుంటారు. కానీ నోటి దుర్వాస‌న‌ను అలా అరిక‌ట్టలేరు. వీటి వ‌ల్ల మ‌నం త‌ర‌చుగా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. సాధార‌ణంగా శ‌రీరం చెమ‌ట ప‌ట్టిన త‌రువాత బ్యాక్టీరియా కార‌ణంగా దుర్వాస‌న ప్రారంభం అవుతుంది. ఇలాగే కొన‌సాగితే బాక్టీరియా వ‌ల్ల మ‌నం వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశ‌ముంది. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:  భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అస్సలు చెయ్యకూడని పూజలు ! తప్పక తెలుసుకోండి !

కొబ్బ‌రినూనెను ఆయుర్వేద మూలిక‌ల‌ను త‌యారుచేయ‌డానికి ఉప‌యోగిస్తారు. గాయాల‌ను న‌యం చేయ‌డానికి కొబ్బ‌రినూనె ఉప‌యోగిస్తాం. ఎందుకంటే ఇలా చేయ‌డం వ‌ల్ల గాయంపై బ్యాక్టీరియా కూర్చోదు. గాయం త‌క్కువ స‌మ‌యంలోనే న‌యం అవుతుంది. అందుకే కొబ్బ‌రినూనె రోజూ వాడాలి. కొబ్బ‌రినూనెలో యాంటిమైక్రోబ‌య‌ల్ గుణాలు ఉంటాయి. శ‌రీరం నుంచి చెడు వాస‌న‌ను రానివ్వ‌వ‌వు.

Advertisement


నిమ్మ‌కాయ స‌హ‌జ‌మైన క్రిమినాశ‌క మందు అనే చెప్పాలి. దీనిని తీసుకోవ‌డం ద్వారా శ‌రీరానికి మేలు చేస్తుంద‌ని భావిస్తుంటారు. అదేవిధంగా ఇది నోటి దుర్వాస‌న‌ను కూడా నివారిస్తుంది. చ‌ర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొల‌గించ‌డానికి అద్భుతంగా ప‌ని చేస్తుంది. నిమ్మ‌కాయ శ‌రీరంలోని బ్యాక్టీరియాతో స‌హా హానిక‌ర‌మైన టాక్సిన్ ని తొల‌గిస్తుంది. అందువ‌ల్ల స్నానం చేసేట‌ప్పుడు నీటిలో నిమ్మ‌ర‌సం వేసి చేయండి. చంక‌ల‌పై కూడా అప్లై చేసి శుభ్రం చేసుకోవ‌డం ద్వారా దుర్వాస‌న‌ను అరిక‌ట్ట‌వ‌చ్చు.


మెంతులు తీసుకోవ‌డం ద్వారా మీ బ‌రువు వేగంగా త‌గ్గిపోతుంది. అదేవిధంగా ప్ర‌జ‌లు శ‌రీరాన్ని నిర్వీషీక‌ర‌ణ చేయ‌డానికి మెంతి పానీయాల‌ను తీసుకుంటారు. మెంతి గింజ‌లు యాంటి ఆక్సిడెంట్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. శ‌రీరంలోని బ్యాక్టీరియాను తొల‌గించ‌డానికి ప‌ని చేస్తుంది. ప్ర‌తిరోజూ మీరు ఈ పానియాల‌ను తీసుకుంటే మీ చెమ‌ట వాస‌న ఆగిపోతుంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ప్ర‌య‌త్నించి చూడండి.

Also Read : 

అభిమాని ఇంటికి వెళ్లి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన బాల‌య్య‌.. ఆ త‌రువాత ఏం చేశారంటే..?

మీరు నీళ్లు త‌క్కువ‌గా తాగుతున్నారా..? అయితే మీకు ఈ ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Visitors Are Also Reading