Home » శ్రీదేవి డెత్ మిస్టరీని కనిపెట్టిన వైద్యులు.. అలా జరిగిందా ?

శ్రీదేవి డెత్ మిస్టరీని కనిపెట్టిన వైద్యులు.. అలా జరిగిందా ?

by Anji
Ad

భారతీయ సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాల పాటు మహారాణిగా వెలిగిన నటి శ్రీదేవి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి. అందంగా, నాజూకుగా కనిపించాలని ఆమె తీసుకున్న జాగ్రత్తల వల్లనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని అంటే అవును అనే అంటున్నారు ఆమె మరణాన్ని దగ్గర నుంచి చూసిన కొంత మంది డాక్టర్లు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ లో కూడా శ్రీదేవికి లోబీపీ ఉందని.. ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడిపోయి మరణించిందని చెప్పుకొచ్చారు.  

Advertisement

దీంతో డాక్టర్లు కూడా శ్రీదేవి మరణం గురించి చెబుతూ అందం గురించి డైట్ చేసే వాళ్లను హెచ్చరించారు. శ్రీదేవి అందంగా కనిపించడం కోసం ఉప్పు తక్కువగా ఉండే ఫుడ్ ఫాలో అయ్యేదని.. అదే ఆమె ప్రాణాలు కోల్పోయేందుకు ఓ రకంగా కారణమైందని డాక్టర్లు సైతం ఇలా ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవద్దని హెచ్చరించారు. అయినా ఆమె చనిపోయేంతవరకు కూడా ఉప్పు లేకుండానే తినడంతో అది కాస్త లోబీపీకి దారి తీసి..అకస్మిక మరణానికి ఇది కూడా ఓ కారణం అని ఆమె భర్త బోనీ కపూర్ సైతం చెబుతున్నారు. 

Advertisement

రుచి పచిలేని ఫుడ్ తీసుకోవద్దని.. ముఖ్యంగా డైట్ లో ఉప్పును అసలే మిస్ చేయవద్దని చెబుతున్నారు. మనిషి వయస్సు, బాడీ మాస్ ఇండెక్స్, ఆరోగ్యం తదితర ఆధారంగా మనిషి, మనిషికి సోడియం తీసుకునే విధానం మారుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆహారం నుంచి ఉప్పును పూర్తిగా స్కిప్ చేయకూడదు. ఉప్పులో ఉండే సోడియం లవణం మరింత అవసరం. ఇది బాడిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. సెల్యూలర్ ఫంక్షన్స్ సరిగ్గా ఉండేవిధంగా చేస్తుంది. అందుకే డబ్ల్యూహెచ్ఓ కూడా ఓ మనిషి ప్రతిరోజు మినిమం 5 గ్రాముల ఉప్పును ఫుడ్ తో పాటు తీసుకోవాలని చెబుతుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ఆరోజును తలచుకుంటే… బన్నీ లో ఇప్పటికి కూడా బాధ..? ప్రెగ్నెంట్ కారుని ఢీకొట్టడం వల్లే..!

 రవితేజని ట్రోల్ చేస్తున్న యశ్ ఫ్యాన్స్… ఆ మాట అనడమే అందుకు కారణం..!

Visitors Are Also Reading