Home » డాక్టర్ సినిమాలో విలన్ గా నటించిన నటుడిని గుర్తుపట్టారా…? ఆ సూపర్ హిట్ సినిమాలో హీరో..!

డాక్టర్ సినిమాలో విలన్ గా నటించిన నటుడిని గుర్తుపట్టారా…? ఆ సూపర్ హిట్ సినిమాలో హీరో..!

by AJAY
Ad

కొంతమంది హీరోలు పరిస్థితులను బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్లుగా మారిపోతుంటారు. కేవలం హీరోగానే కొనసాగాలి అనుకుంటే కొన్నిసార్లు ఆఫర్లు రాకపోవచ్చు కూడా… దాంతో పూర్తిగా సినిమాలకు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తెలివైన హీరోలు సమయం దొరికినప్పుడు పాత్రకు ప్రాముఖ్యత ఉంటే నటించడానికి వెనకాడరు. అదే విధంగా ప్రస్తుతం సినిమాల్లో హీరోలు ఎంత ప్రాధాన్యత ఉందో విలన్ కు సైతం అంతే ప్రాధాన్యత ఉంటుంది.

Advertisement

కాబట్టి విలన్ పాత్రలు చేయడానికి సైతం హీరోలు ముందుకు వస్తున్నారు. దానికి నిదర్శనం జగపతిబాబు ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఉండేవారు. కానీ ఇప్పుడు విలన్ పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. అంతేకాకుండా హీరో కంటే జగపతిబాబు విలన్ గానే ఎక్కువ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అదేవిధంగా టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గా అలరిస్తున్నారు.

Advertisement

ఇక కమెడియన్ సునీల్ తర్వాత హీరోగా సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన విలన్ గా మెప్పిస్తున్నారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ వాన సినిమా ప్రేమ కథలను ఇష్టపడేవారికి గుర్తుండిపోయే సినిమా. ఈ సినిమాకు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు.

 

సినిమాలో హీరోగా వినయ్ రాయ్ నటించారు. అంతేకాకుండా హీరోయిన్ గా మీరా చోప్రా నటించింది. ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రేమికులను ఈ సినిమా ఎంతగానో ఆకర్షించింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరో అమాయకంగా ఎమోషనల్ గా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ హీరో కూడా విలన్ పాత్రలో నటించారు. రీసెంట్ గా శివకార్తికేయ హీరో గా డాక్టర్ అనే తమిళ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాలో నటించింది ఎవరో కాదు. వాన సినిమా హీరోనే డాక్టర్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ విషయం తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు.

 

Also read : త‌మ ఫ్యాన్స్ ను పెళ్లి చేసుకున్న 5 గురు న‌టులు! 100% ల‌వ్

Visitors Are Also Reading