Home » త‌మ ఫ్యాన్స్ ను పెళ్లి చేసుకున్న 5 గురు న‌టులు! 100% ల‌వ్

త‌మ ఫ్యాన్స్ ను పెళ్లి చేసుకున్న 5 గురు న‌టులు! 100% ల‌వ్

by Azhar
Ad

సినిమావాళ్ల‌ల్లో ల‌వ్ మ్యారేజ్ లు కామ‌న్ విష‌యమే, అయితే అది కో స్టార్ నో, లేదా పెద్ద‌స్థాయిలో ఉన్న‌వారితోనో జ‌రుగుతాయి. కానీ ఈ 5 గురు న‌టులు తమ ఫ్యాన్స్ ప్రేమ‌లో ప‌డి వారినే పెళ్లిచేసుకున్నారు.

రజనీకాంత్ –లత:
ఎథిరాజ్ ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్ గా ఉన్న ల‌త‌, రజనీకాంత్ ని ఇంటర్వ్యూ చేశారు. అలా మొద‌లైన వీరి పరిచ‌యం త‌ర్వాత ప్రేమ‌గా మారింది. 1981 ఫిబ్రవరి 26న‌ తిరుపతి వీరి వివాహం జ‌రిగింది.

Advertisement

విజయ్ – సంగీత:
సంగీత‌కు విజ‌య్ అభిమాన న‌టుడు …ఒక షూటింగ్ లో అత‌డిని క‌లిసి ఆటోగ్రాఫ్ తో పాటు ఫోన్ నెంబ‌ర్ తీసుకుంది. త‌ర్వాత చాటింగ్ లు , కాల్స్ తో వీరిద్ద‌రూ ద‌గ్గ‌ర‌య్యారు. ఒక‌రోజు సంగీత‌ను ఇంటికి పిలిచి ఇంట్లో వాళ్ల‌కు ప‌రిచ‌యం చేసి పెళ్లి బాజాలు మోగించాడు విజ‌య్!

మాధవన్ – సరితా బిజ్రే:
న‌టుడిగా కెరీర్ ప్రారంభించ‌డానికి ముందు మాధ‌వ‌న్ ఒక ఇన్సిస్టూట్ లో కమ్యునికేషన్ స్కిల్స్ ను టీచ్ చేసేవాడు. ఆ క్లాస్ లో స్టూడెండ్ అయిన స‌రితా మాధ‌వ‌న్ తో ప్రేమ‌లో ప‌డింది. మాధ‌వ‌న్ కూడా ఆమెను న‌చ్చి వివాహం చేసుకున్నాడు.

Advertisement

ఈషా డియోల్ – భరత్ తక్తాని:
ఈషా డియోల్ సినిమాల‌న్నా ఆమె న‌ట‌న అన్నా భ‌ర‌త్ త‌క్తానికి చాలా ఇష్టం. క‌ట్ చేస్తే భరత్ తక్తాని ఈషా డియోల్ పెళ్లిచేసుకున్నాడు.

రాజేష్ కన్నా – డింపుల్ కపాడియా:

రాజేష్ క‌న్నా బాలీవుడ్ లో స్టార్ హీరోగా అంద‌రి ప్ర‌శంస‌లు పొంది సినిమాల నుండి రిడైర్డ్ అయ్యారు. అటు త‌ర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన డింపుల్ క‌పాడియా …. రాజేష్ మీద ఉన్న అభిమానంతో అత‌నిని పెళ్లి చేసుకుంది. వీరి కూతురే ట్వింకిల్ కన్నా.. అక్షయ్ కుమార్ భార్య.

రాజేష్ క‌న్నా బాలీవుడ్ లో స్టార్ హీరోగా అంద‌రి ప్ర‌శంస‌లు పొంది సినిమాల నుండి రిడైర్డ్ అయ్యారు. అటు త‌ర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన డింపుల్ క‌పాడియా ….రాజేష్ మీద ఉన్న అభిమానంతో అత‌నిని పెళ్లి చేసుకుంది. వీరి కూతురే ట్వింకిల్ కన్నా.. అక్షయ్ కుమార్ భార్య.

Also Read: డాక్టర్ సినిమాలో విలన్ గా నటించిన నటుడిని గుర్తుపట్టారా…? ఆ సూపర్ హిట్ సినిమాలో హీరో..!

Visitors Are Also Reading