ఆచార్య చాణక్యుడు మనకు చాలా విషయాలు అనగా మంచి, చెడు తెలియజేస్తుంటాడు. వందల సంవత్సర కిందట ఆచార్యుడు తన నీతిశాస్త్రంలో రాసిన విషయాలు ఇప్పటికీ కూడా ఈ కాలంలో అర్థవంతంగా ఉన్నాయి. ఆచార్య చెప్పిన కొన్ని మాటలను మీరు పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవచ్చు. మనం ఇంట్లో చేసే పనుల్లో ఆటంకాలకు కారణాలు గురించి తెలుసుకుందాం.
మన ఇంట్లో కుటుంబ కలహాలు అంటే భార్య, భర్త కావచ్చు. అత్తా కోడలు కావచ్చు. ఇలా ఎవరైనా పదే పదే గొడవ పడుతుంటారు. గొడవ పడడం అనేది మీకు చెడు స్టార్ట్ అయినట్టే. ఇలా పదే పదే గొడవలు పడేవారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. అదేవిధంగా ఇంట్లో పూజలు చేయకపోవడం దేవుడి పట్ల భక్తి లేకపోవడం ఇలాంటివన్నీ లేకపోవడం వల్ల మనశ్శాంతి, సంతోషం లేకుండా పోతాయి. పెద్దవారి పట్ల గౌరవం లేకపోవడం పెద్దవారిని కించపరచడం లాంటివి చేయడం, వల్ల మీరు సంతోషాలకు దూరం అవుతారు. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. మీకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశముంది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులతో చాలా ఇబ్బందులు పడతారు. ఆడవారి చేతులు గాజులు పగిలిపోవడం పదే పదే గాజు వస్తువులు పగిలిపోవడం వల్ల కుటుంబంలో కలహాలు దారి తీస్తుంది.
Advertisement
Advertisement
అదేవిధంగా డబ్బు సంపాదించిన విషయాల్లో ఇబ్బందులు పడుతుంటారు. ఇంట్లో తులసి చెట్లు ఎండిపోవడం వల్ల మీ జీవితాల్లో సమస్యలు స్టార్ట్ అయినట్టే అని సంకేతం. ఇలాంటివి అన్నీ జరుగకుండా ఉండాలంటే మీ ఇంట్లో తులసి చెట్టుకు రోజు నీరు పోయాలి. అదేవిధంగా ఇంట్లో పూజలు చేయాలి. అదేవిధంగా పెద్ద వారి పట్ల గౌరవం చూపించాలి. భార్య భర్త పదే పదే గొడవలు పడకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఇలాంటివి అన్ని చేయడం వల చెడు తొలిగిపోయి అంతా మంచే జరుగుతుందని ఆచార్య చాణక్య చెప్పాడు.
Also Read :
కృతిశెట్టి ఆ సినిమా విషయంలో చాలా ఇబ్బంది పడిందట.. ఎందుకో తెలుసా..?
గుర్తుపట్టనంతగా మారిపోయిన చందమామ హీరోయిన్….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…!