Telugu News » Blog » కృతిశెట్టి ఆ సినిమా విష‌యంలో చాలా ఇబ్బంది ప‌డింద‌ట‌.. ఎందుకో తెలుసా..?

కృతిశెట్టి ఆ సినిమా విష‌యంలో చాలా ఇబ్బంది ప‌డింద‌ట‌.. ఎందుకో తెలుసా..?

by Anji
Ads

ప్ర‌తీ సంవ‌త్స‌రం సినీ ఇండ‌స్ట్రీకి కొత్త హీరోయిన్‌లు వ‌స్తుంటారు పోతుంటారు. అందులో కొంద‌రు మాత్ర‌మే ప్రేక్ష‌కుల మ‌న‌సులో చోటు ద‌క్కించుకుంటారు. ఇక అందులో ఉప్పెన సినిమా హీరోయిన్ కృతిశెట్టి ముందుంటారు. ఈమె వ‌రుస సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నారు. తాను న‌టించిన ఉప్పెన సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్ర‌స్తుతం ఈమె రామ్ పోతినేని హీరోగా వ‌స్తున్న వారియ‌ర్ చిత్రంలో న‌టిస్తోంది. కృతిశెట్టి ముంబైలోనే పుట్టి పెరిగింది. వీళ్ల తండ్రి ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ కాగా.. త‌ల్లి ఫ్యాష‌న్ డిజైన‌ర్‌. ఆమె ప‌లు సినిమాల‌కు కూడా ప‌ని చేశారు.

Ads

 

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి ఈమె చేసే ప్ర‌తి సినిమా హిట్ కావ‌డం విశేషం. ఇప్ప‌టికే ఈ బ్యూటీ న‌టించిన వ‌రుస సినిమాలు హ్యాట్రిక్ హిట్. ఆ తరువాత ది వారియ‌ర్‌. జులై 14న విడుద‌లుతోంది. ఈ త‌రుణంలో రామ్‌-కృతిశెట్టి ఇద్ద‌రూ బిజీగా ఉన్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాజాగా ఇంట‌ర్వ్యూలో కృతిశెట్టి మాట్లాడారు. నా మాతృభాష తుళు అయిన‌ప్ప‌టికీ తాను తెలుగులోనే చాలా బాగా మాట్లాడుతాను. ఇంత‌వ‌ర‌కు తెలుగు తెలిసిన ద‌ర్శ‌కుల‌తోనే నేను ప‌ని చేశాను.

Ads

ఇక త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుసామి గారి తెలుగులో యాస ఉంటుంది. నాకు త‌మిళం తెలియ‌దు. అందువ‌ల్ల ఆయ‌న‌తో నేను మాట్లాడే తెలుగు నాకు అర్థ‌మ‌య్యేద ఇకాదు. అలా వారం రోజుల వ‌ర‌కు ఇబ్బంది ప‌డ్డాను. హీరో రామ్ గారికి త‌మిళం చాలా బాగా వ‌చ్చు. అందువ‌ల్ల ఆయ‌న స‌పోర్ట్ తీసుకున్నాను. లింగుసామి ఏం చెబుతున్నార‌నేది నాకు రామ్ చెప్పేవారు. ఆ త‌రువాత నేను అల‌వాటు ప‌డిపోయాను. ఈ చిత్రంలో నేను రేడియో జాకిగా క‌న‌పిస్తాను. నా పాత్ర ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని కృతిశెట్టి వెల్ల‌డించింది.

Also Read : 

గుర్తుపట్టనంతగా మారిపోయిన చందమామ హీరోయిన్….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…!

Ad

తీవ్రంగా ఎమోషన్ అయిన యాంకర్ సుమ.. కారణం తెలిస్తే..?