Home » వెంకటేష్ మల్లీశ్వరి చిత్రంలో చేసిన ఈ చిన్న పాప గుర్తుందా.. ఇప్పుడెలా ఉందంటే..?

వెంకటేష్ మల్లీశ్వరి చిత్రంలో చేసిన ఈ చిన్న పాప గుర్తుందా.. ఇప్పుడెలా ఉందంటే..?

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు. వివాద రహితుడిగా ఆయనకు గొప్ప క్రేజ్ ఉంది. అలాంటి వెంకటేష్ ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతారు. ఆయన సినిమాల్లో మల్లీశ్వరి సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ప్రతి సీన్ ఎంతో అద్భుతంగా కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రంలో వెంకటేష్ అన్నయ్య కూతురు డాలిగా ఒక చిన్నారి నటించింది. ఆ పాప ఉన్నది రెండు సీన్లు అయినా కానీ అందరికీ గుర్తుండిపోయింది.

Also Read:చిరంజీవి వల్లే నా కెరియర్ నాశనమైంది.. బుల్లితెర మెగాస్టార్ రాజ్ కుమార్..!!

ప్రస్తుతం ఆ పాప పెద్దమ్మాయి అయిపోయింది. తాజాగా ఆమెను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మరి ఆమె గురించి పూర్తి వివరాలు చూద్దామా.. మల్లీశ్వరిలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పాప పేరు గ్రీష్మ నేత్రి.. ఈ మూవీ తో పాటు కొంచెం ఇష్టం కొంచెం కష్టం, దుబాయ్ శీను, ప్రస్థానం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,లాంటి 30 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే చదువు కూడా పూర్తి చేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ పాప ప్రస్తుతం ఇండస్ట్రీలో పూర్తిస్థాయి నటిగా రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

Also Read:5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!

దీనిలో భాగంగానే ఫోటోషూట్స్ కూడా ఇస్తూ దర్శక నిర్మాతల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈమె మల్లీశ్వరిలో నటించిన చిన్న పాప, ఇంత పెద్దది అయిందా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే గ్రీష్మ సోదరి కూడా లవ్ యూ బంగారం మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆమె పేరు శ్రావ్య. మరి ఈ పాప మీలో ఎంతమందికి గుర్తుంది.. అనే విషయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.

Also Read:బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్-ఉపాసన!

Visitors Are Also Reading