Home » టిఫిన్ బండి వ‌ద్ద టిఫిన్ చేస్తున్న ఈ కోటీశ్వ‌రుడిని మీరు గుర్తు ప‌ట్టారా..?

టిఫిన్ బండి వ‌ద్ద టిఫిన్ చేస్తున్న ఈ కోటీశ్వ‌రుడిని మీరు గుర్తు ప‌ట్టారా..?

by Anji
Ad

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా హ‌వా న‌డుస్తుంది. నిత్యం ఏదో ఒక విష‌యం వైర‌ల్ అవుతూనే ఉంది. కొన్ని సార్లు ఫోటోలు, మ‌రొకొన్ని సార్లు వీడియోలు, ఇంకొన్నిసార్లు స్టార్ సెల‌బ్రిటీలు ఇలా వారు వీరు అని తేడా లేకుండా వారికి సంబంధించిన ఏదో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంటుంది. తాజాగా ప్ర‌ముఖ సెలబ్రిటీ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

ఈ ఫోటోలో ఉన్న వ్య‌క్తిని మీరు ఎప్పుడైనా చూశారా.? ఆయ‌న‌ను ఎక్క‌డో చూసిన‌ట్టు అనిపిస్తుంది క‌దా.. మీరు నిజంగానే గుర్తు చేసుకున్నారండి. ఆయ‌న మ‌రెవ్వ‌రో కాదు.. బుల్లితెర సెల‌బ్రిటీ ఆయ‌న రూటే సెప‌రేటు. త‌మ సంస్థ‌ను ప్ర‌మోట్ చేసుకునేందుకు ఇత‌రులు, హీరోలు, హీరోయిన్‌ల‌తో ల‌క్ష‌లు ఖ‌ర్చులు ఖ‌ర్చుపెట్టి యాడ్స్ తీస్తుంటే.. ఈయ‌న సొంతంగానే ప్ర‌చారం చేస్తారు. త‌న‌కంటూ ఉన్న ప్ర‌త్యేక‌త‌తో వ్యూయ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటారు.

Advertisement


ముఖ్యంగా క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును అంత ఈజీగా వ‌దులుకోవ‌చ్చా.. డ‌బ్బులు ఎవ‌రికీ ఊరికే రావంటూ సోష‌ల్ మీడియా ప్ర‌పంచంలో ఓ సునామి సృష్టించిన ఆయ‌న మ‌రెవ్వ‌రో కాదు ల‌లిత జ్యువెల‌ర్స్ అధినేత కిర‌ణ్ కుమార్. ఆయ‌న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. స్టార్ హోట‌ల్‌లో తిన‌గ‌లిగే స‌త్తా ఉన్న‌ప్ప‌టికీ రోడ్డు ప‌క్క‌నే ఉన్న ఓ టిఫిన్ బండి వ‌ద్ద స్నేహితుల‌తో క‌లిసి టిఫిన్ తింటూ క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. నెటిజ‌న్లు త‌మ‌కు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు.

Also Read :

గంట‌ల వ్య‌వ‌ధిలోనే స‌మంత ఫోటోకు ల‌క్ష‌ల్లో కామెంట్స్‌, లైక్స్‌..!

Video Viral : నైట్ క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ..!

Visitors Are Also Reading