Home » గంట‌ల వ్య‌వ‌ధిలోనే స‌మంత ఫోటోకు ల‌క్ష‌ల్లో కామెంట్స్‌, లైక్స్‌..!

గంట‌ల వ్య‌వ‌ధిలోనే స‌మంత ఫోటోకు ల‌క్ష‌ల్లో కామెంట్స్‌, లైక్స్‌..!

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర‌హీరోల్లో ఒక‌రిగా ఓ వెలుగు వెలుగుతోంది స‌మంత‌. నాగ‌చైత‌న్య‌తో విడిపోయినట్టు ప్ర‌క‌టించిన త‌రువాత ఈమె చేసే పోస్టులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ముఖ్యంగా స‌మంత‌కు ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో మంచి ఫాలోయింగ్ ఉంద‌నే చెప్పాలి. త‌రుచూ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ ఇస్తుంది సామ్‌. ఈ మ‌ధ్య కాలంలో త‌న ఫిట్‌నెస్ వీడియోలు, కొటేష‌న్స్‌, ప్ర‌మోష‌న‌ల్ బ్రాండ్స్ త‌దిత‌ర పోస్టులు చేస్తుంది.

Advertisement

తాజాగా స‌మంత చేసిన ఓ పోస్ట్ చూసి త‌న అభిమానులు సంబ‌ర‌ప‌డుతున్నారు. సామ్ వైట్ ఫ్ల‌వ‌ర్స్ ప‌ట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తున్న ఓ ఫోటోను షేర్ చేసింది. దానికి వ‌య‌స్సు పెరిగే కొద్ది ఆలోచ‌న స్థాయి కూడా పెరుగుతుంద‌ని అర్థం వ‌చ్చే విధంగా కామెంట్ చేసింది. ఈ పోస్ట్ షేర్ చేసి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే మిలియ‌న్‌కి పైగా లైక్స్ రావ‌డం విశేషం. ఈ పిక్ కి హీరోయిన్ కావ్య థావ‌ర్‌, స్టైలిస్ట్ ప్రీతం లాంటి సెలెబ్రిటిలు రియాక్ట‌య్యారు.

ఇటీవ‌లే స‌మంత 35వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన విష‌యం విధిత‌మే. ఏప్రిల్ 28న స‌మంత న‌టించిన క‌ణ్మ‌ని రాంబో ఖ‌తీజా సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు స‌రైన స్పంద‌న మాత్రం రాలేదు. ఇక సామ్ న‌టించిన సినిమాలు త్వ‌ర‌లోనే విడుద‌ల‌య్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ య‌శోద ఆగ‌స్టులో విడుద‌ల‌వుతుంది. అదేవిధంగా పౌరాణిక చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌నులు జ‌రుపుకుంటోంది. అత్యంత త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల‌వుతుంది. ఈ రెండు సినిమాల‌తో స‌మంత క్రేజ్ మ‌రింత పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Also Read : 

స‌ర్కారు వారి పాట స్టోరీ లీక్‌.. మ‌నీ విష‌యంలో మ‌హేష్ అందుకే అలా చేశాడా..?

స‌ర్కారు వారి పాట డైలాగ్‌లు : Sarkaru Vaari Paata Movie Dialogues

Visitors Are Also Reading