Home » “ఈ నగరానికి ఏమైంది..” యాడ్ లో నటించిన చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

“ఈ నగరానికి ఏమైంది..” యాడ్ లో నటించిన చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

by Mounika
Ad

సినిమాకి ముందు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ యాడ్ గుర్తుందా..? థియేటర్లలో సినిమాకి ముందు  “ఈ నగరానికి ఏమైంది..? సంతోషాన్ని ఎవరు కోరుకోరు..” అనే స్మోకింగ్ యాడ్ వస్తుంది. ఆ యాడ్ లో స్మోకింగ్ చేస్తున్న తన తండ్రి ముఖంలోకి అమాయకంగా చూస్తున్న అమ్మాయిని ఎవరూ మర్చిపోలేరు. ఆ చిన్ని అందం పెరిగి నేడు హీరోయిన్ అయింది. ఇప్పుడు ఆ చిన్నారి ఇరవై ఐదేళ్ల యువతి. ఆమె పేరు సిమ్రాన్ నటేకర్. ఏడు సంవత్సరాల వయస్సులో, సిమ్రాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ కోసం ధూమపాన వ్యతిరేక ప్రకటనలో నటించింది. 150కి పైగా యాడ్ ఫిలిమ్స్ లో నటించిన సిమ్రాన్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి .

smoking ad child artist

Advertisement

ప్రస్తుతం ముంబైకి చెందిన సిమ్రాన్ నటేకర్ స్థానికంగా ఉన్నటువంటి కాలేజీలో మోడలింగ్ రంగంలో డిగ్రీని పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె తండ్రి ముంబైలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. సిమ్రాన్ తల్లిదండ్రులు సినిమా పరిశ్రమకు చెందిన వారు కావడంతో ఆమెకు చిన్నప్పుడు నో స్మోకింగ్ అవేర్నెస్ ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. దీంతో సిమ్రాన్ నటేకర్ పలు చిత్రాలలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె బంధన్ సాత్ జన్మో కా అనే టీవీ సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఆమె మొదటి బాలీవుడ్ పాత్ర యష్ రాజ్ ఫిల్మ్స్ యొక్క దావత్-ఎ-ఇష్క్. ఆమె బెస్ట్ ఆఫ్ లక్ లాలూలో మహిళా ప్రధాన పాత్ర పోషించింది.

Advertisement

అయితే చదువు నిమిత్తం కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది సిమ్రాన్.ఆ చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్దవ్వడంతో  ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తోందట సిమ్రాన్. తన సోషల్ మీడియా వేదికగా సిమ్రాన్ గ్లామర్ ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.   సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ మెరుపులకు రెడీ అంటూ సిమ్రాన్  ఫిలిం ఇండస్ట్రీకి సంకేతాలు ఇస్తుంది.

తాజా సమాచారం ప్రకారం సిమ్రాన్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ ఓ నిర్మాణ సంస్థ ఆడిషన్స్ లో సిమ్రాన్ హీరోయిన్ గా ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. సౌత్ లో ఆఫర్స్ కోసం సిమ్రాన్ ఆడిషన్స్ లో పాల్గొంటూ ఫిలిం మేకర్స్ దృష్టిలో పడేందుకు  ప్రయత్నాల్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Savitri : మహానటి సావిత్రిని ఆర్థికంగా దెబ్బతీసిన చిత్రం ఏదో తెలుసా..!

Rajinikanth: అప్పట్లోనే రజినీకాంత్ హాలీవుడ్ సినిమాలో నటించారని తెలుసా? ఆ సినిమా ఏదంటే?

కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ తారలు ఎలా మరణించారో తెలుసా…?

 

Visitors Are Also Reading