Home » Rajinikanth: అప్పట్లోనే రజినీకాంత్ హాలీవుడ్ సినిమాలో నటించారని తెలుసా? ఆ సినిమా ఏదంటే?

Rajinikanth: అప్పట్లోనే రజినీకాంత్ హాలీవుడ్ సినిమాలో నటించారని తెలుసా? ఆ సినిమా ఏదంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వచ్చింది అంటే చాలు ఫ్యాన్స్ కి పండగే. ముఖ్యంగా తమిళనాట రజినీ సినిమా వచ్చింది అంతే చాలు పండగ వాతావరణం కనిపిస్తుంది. తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ ను తలైవా అని పిలుచుకుంటారు. ఇక ఆయనపై ప్రాణాలు కూడా ఆలోచించకుండా ఇచ్చ్చేసేంత అభిమానం ఉంటుంది. రజనీకాంత్ కు కోలీవుడ్ లో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనూ అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు చాలా వరకు తెలుగు నాట కూడా హిట్ అయ్యాయి.

Advertisement

రజినీకాంత్ సినిమాల్లోకి రాకముందు కండక్టర్ గా పని చేసేవారన్న సంగతి తెలిసిందే. అయితే.. సినిమాలపై ఉన్న ఆసక్తి కొద్దీ ఆయన సినిమా రంగం వైపుకు వచ్చారు. మొదట తెలుగు ఇండస్ట్రీ లోనే పరిచయం అయిన రజినీకాంత్ క్రమంగా తమిళ్ ఇండస్ట్రీలో కూడా పేరు తెచ్చుకుని సూపర్ స్టార్ గా ఎదిగారు. ఎక్కడో కండక్టర్ గా మొదలైన రజిని జీవితం నేడు అందనంత ఎత్తుకు చేరుకుంది.

Advertisement

అయితే.. ఆరోజుల్లోనే రజినీకాంత్ హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. ఆ సినిమా పేరు బ్లడ్ స్టోన్. అశోక్ అమృతరాజ్ ఈ సినిమాను నిర్మించారు. డ్వైట్ హెల్ లిటిల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిజానికి హాలీవుడ్ సినిమా అంటే.. అక్కడివారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కానీ, ఈ సినిమాలో ఓ సౌత్ హీరోకు ఇంపార్టెంట్ రోల్ ఇవ్వడం విశేషం. బ్లడ్ స్టోన్ అనే వజ్రం ఇతర దేశాల నుంచి భారత దేశానికీ వస్తుంది. దానితో ఈ సినిమా షూటింగ్ కొంత మేర బెంగళూరు, మైసూరు లాంటి ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఈ వజ్రాన్ని రజిని తన స్నేహితుడుతో కలిసి ఎలా కాపాడాడు అనే కథాంశంతో సినిమా రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. కొన్ని సీన్స్ లో రజిని అంత రిస్క్ తీస్కుని కూడా నటించడం చూసి ఫారిన్ టెక్నీషియన్స్ సైతం ఆశ్చర్యపోయారట. ఈ సినిమా డబ్బింగ్ కూడా రజినీనే చెప్పుకోవడం విశేషం.

మరిన్ని..

 చెన్నై, బెంగళూరులో రజినీ జైలర్ ఫీవర్.. ఆఫీస్ లకు సెలవు, ఫ్రీ టికెట్స్..!

బాలకృష్ణ డేట్స్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఎదురుచూస్తున్నాడా ? 

Visitors Are Also Reading