Home » Savitri : మహానటి సావిత్రిని ఆర్థికంగా దెబ్బతీసిన చిత్రం ఏదో తెలుసా..!

Savitri : మహానటి సావిత్రిని ఆర్థికంగా దెబ్బతీసిన చిత్రం ఏదో తెలుసా..!

by Mounika
Ad

Savitri : సీనియర్స్ స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఒడదుడుకులను ఎదుర్కొని ఒక్కోమెట్టు ఎక్కి ఉన్నత శిఖరాలకు వెళ్లారు సావిత్రి. జీవితంలో ఎంత వేగంగా సక్సెస్ ని చూశారో… అంతే వేగంగా తన కెరీర్ ని ఆమె చేతులారా నాశనం చేసుకున్నారు సావిత్రి (savitri). ఎందుకంటే ఆమె నిజ జీవితంలో పెళ్లి తరువాత సావిత్రికి సినీ ఇండస్ట్రీలో పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి.

Savitri

Savitri

తమిళంలో సావిత్రి ఆమె భర్త జెమిని గణేషన్ తో కలిసి నటించిన సినిమాలు అన్ని విఫలమయ్యాయి అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సొంతంగా ఇద్దరు కలిసి చేసిన సినిమాలకు ఎక్కువగా డబ్బును ఖర్చు చేశారట సావిత్రి. అదే సమయంలో జెమిని గణేషన్ వేరే నటితో పరిచయం ఏర్పడుతుంది. ఎప్పుడైతే జెమినీ గణేషన్ కు ఉన్న ఎఫైర్స్ గురించి సావిత్రి తెలిసిందో దాంతో వారి కాపురం లో అలజడులు మొదలయ్యాయి. భర్త మీద కోపంతో సావిత్రి ఎంతమంది చెప్పినా వద్దన్నా వినకుండా సొంత డబ్బుతో తీసినా చిన్నారి పాపలు అనే సినిమా ఆర్థికంగా నష్టపోయేలా చేసిందట.

Advertisement

Advertisement

సావిత్రి స్వీయదర్శకత్వంలో ఈ సినిమాలో షావుకారు జానకి, జమున వంటి స్టార్ హీరోయిన్స్ ను తీసుకుంది. సావిత్రి ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని ముందుగానే నటీనటులకు  రెమ్యూనిరేషన్ ఇవ్వడం జరిగింది. ఇక డబ్బు ముందుగానే చేతికి రావడంతో కొందరు నటులు షూటింగ్ కి ఆలస్యంగా వెళ్ళేవారట. అంతేకాకుండా సావిత్రి సినిమా పూర్తి కాకముందే వేరే ప్రాజెక్ట్స్ కి కాల్ సీట్లు ఓకే చేసేవారట. దాంతో చిన్నారి పాపలు సినిమా సావిత్రి అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు .

chinnari papalu

ఈ సినిమా సావిత్రికి ఆర్థికంగా ఎన్నో నష్టాలు తీసుకువచ్చినా సమయంలోనే సావిత్రిపై ఐటీ శాఖ దాడులు జరిగాయి. ఇలా సావిత్రి ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన చిన్నారి పాపలు సినిమా ఆమెని ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా కృంగదీసేసింది . ఒకవేళ సావిత్రి ఈ సినిమా తీయాలని గనుక నిర్ణయించుకొని ఉండకపోతే ఆర్థికంగా కృంగిపోయేవారు కాదని, అప్పటిలో సావిత్రితో సన్నిహితంగా ఉండేవారు ఇప్పటికి కూడా చెబుతూ ఉంటారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Ileana D’Cruz : పండంటి బాబుకి జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

Rajinikanth: అప్పట్లోనే రజినీకాంత్ హాలీవుడ్ సినిమాలో నటించారని తెలుసా? ఆ సినిమా ఏదంటే?

Chiranjeevi: మెగాస్టార్ కి ఉన్న ఈ ఒక్క అలవాటే ఆయనకు శాపంగా మారుతోందా?

 

Visitors Are Also Reading