టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశాడు సీనియర్ నటుడు అర్జున్. అర్జున్ నటుడుగా చేస్తూ.. మరోవైపు సినిమాలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తో ఓ చిత్రం చేయాలని అతన్ని ఒప్పించి షూటింగ్ ప్రారంభించాడు. అయితే విశ్వక్ సేన్ అకస్మాత్తుగా వెనక్కి తగ్గాడు. దీంతో అర్జున్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు సమాచారం. ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ పై విరుచుకుపడ్డారు అర్జున్. ఓ కార్యక్రమంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశ్వక్ సేన్.
Advertisement
స్క్రిప్ట్ విషయంలో నచ్చక అర్జున్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు వెల్లడించాడు. అయితే తన కొత్త సినిమా అయినటువంటి ధమ్కి ప్రమోషన్స్ లో భాగంగా మళ్లీ ఇదే ప్రశ్న విశ్వక్ సేన్ కి ఎదురైంది. అర్జున్ సినిమా నుంచి తప్పుకున్నందుకు గాను పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చినట్టు వచ్చిన వార్తలపై సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ఆ వ్యవహారానికి ఈ సినిమాకి అస్సలు సంబంధం లేదు. ఎంతో మందిపై ఉన్న గౌరవంతో తాను ఆ విషయం గురించి మాట్లాడదలచుకోవడం లేదు అని అన్నారు.
Advertisement
Also Read : అవకాశం కోసం పక్కలోకి రమ్మన్నారు – శ్రీముఖి
అదేవిధంగా దమ్కీ చిత్రానికి ముందుగా నరేష్ కుప్పిని డైరెక్టర్ అనుకొని తరువాత తప్పించడం గురించి విశ్వక్ సేన్ స్పందించారు. “తొలుత ఈ చిత్రానికి నరేష్ ని డైరెక్ట్ గా అనుకున్నా.. అతను నేను కలిసి పాగల్ సినిమా చేశాం.. దమ్కీ సినిమాకు అతను న్యాయం చేయగలడని అనుకున్నా, కానీ కథ చర్చలు జరుగుతున్నప్పుడు అతడి స్టైల్ కి, నా కథకు కరెక్ట్ కాదనిపించింది. అందుకే నేనే డైరెక్ట్ చేయాలనుకున్నా, తనతో మరో సినిమా చేస్తానని చెప్పాను. నాకు అతడికి ఎటువంటి గొడవ కాలేదు” అని చెప్పుకొచ్చారు.
Also Read : దారుణం ఆ ఓపెన్ ప్లేస్ లోనే కాలకృత్యాలు తీర్చుకున్న హీరోయిన్.. కారణం..?