శ్రీశైలం అంటే తెలియని వారుండరు. ఎందుకంటే శ్రీశైలంకు అంతటి ప్రత్యేకత ఉంది. నల్లమల్ల అడవుల్లో కొలువై ఉన్న శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంభ స్వామివార్లను దర్శించుకోవడానికి కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఏపీలో తిరుపతి తరువాత అంతటి జనసమూహం శ్రీశైలంలోనే ఉంటుందనడంలో ఎలాంటి అతివయోక్తి లేదు. అయితే పూర్వకాలంలో శ్రీశైలం వెళ్లాలంటే ఎడ్లబండ్లు, గుర్రాలు, ఏనుగులపై శ్రీశైలం చేరుకునేవారు.
Advertisement
పూర్వకాలంలో తొలుత ఎడ్లబండ్లను, ఎద్దులను, గుర్రాలను కడిగి బొట్లు పెట్టేవారు. ముఖ్యంగా ఎద్దుల కొమ్ములకు రంగులు వేస్తే అవి ఎంతో అందంగా కనిపించేవి. అప్పటి నుంచే ఈ సంస్కృతి ప్రారంభం అయింది. క్రమంగా ఆహార పదార్థాలకు బదులు డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం శ్రీశైలంలో ఈ పని చేసేవారు ఫుల్ టైం, పార్ట్ టైమ్ కలిసి దాదాపు 150 మంది వరకు ఉంటారు.
Advertisement
వీరికి ఒక యూనియన్ కూడా ఉన్నది. తెలంగాణ, కర్నాటక భక్తులు ఎక్కువగా ఈ పెయింటింగ్ పై ఆసక్తి కనబరుస్తారు. త్రిశూలం, శివలింగం, ఓంకారం, నెమలి ఇలా రకరకాల పెయిటింగ్ వేయించుకుంటారు. ఎక్కువగా కార్లకు వేస్తుంటారు. పేయింటింగ్ రివర్స్ వేయడంతోచాలా అందంగా కనిపిస్తుంది. చెంచులు మొదలుపెట్టిన ఈ కళలో ఇప్పుడు కేవలం ఒకరిద్దరూ మాత్రమే చెంచులు ఉండడం గమనార్హం.
Also Read :
ప్రభాస్ కు శ్రీనిధి తెగ నచ్చేసిందట.. అందుకే..?
ఆచార్యకు అదే హైలెట్ సీన్.. సినిమాను నిలబెట్టేది ఇదేనట..!