Home » త్రివిక్రమ్ సినిమాలలో ఈ లాజిక్ ఎప్పుడైనా గమనించారా ? ఇందులో ఉన్న ఒక ప్రత్యేకత ..!

త్రివిక్రమ్ సినిమాలలో ఈ లాజిక్ ఎప్పుడైనా గమనించారా ? ఇందులో ఉన్న ఒక ప్రత్యేకత ..!

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ ల‌లో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఒక‌రు. డైలాగ్ రైట‌ర్ నుంచి అగ్ర స్థాయి ద‌ర్శ‌కుడి గా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఎదిగారు. అయితే ఈయ‌న సినిమా లు ఇప్పటి వ‌ర‌కు చాలానే హిట్ అయ్యాయి. కానీ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సినిమా ల‌లో ఒక కామ‌న్ పాయింట్ ఉంటుంది. దాదాపు ప్ర‌తీ సినిమా లో ఈ కామ‌న్ పాయింట్ క‌నిపిస్తుంది. అది అంటంటే..

Also Read: Balayya unstoppable : ANR ను ఇమిటేట్ చేసిన బాలయ్య…నవ్వులే నవ్వులు…!

Advertisement

ఆయ‌న సినిమా లో హీరోలు త‌ప్ప‌ని స‌రిగా బ్యాగులు స‌ర్ధుకుని ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఒక చోట నుంచి మ‌రొక చోట కు హీరో క‌ద‌లాల్సిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కొన్ని సినిమా ల‌ను చూస్తే మ‌న‌కు సింపుల్ గా అర్థం అవుతుంది. ముందుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటి దారేది.. అనే సినిమా చూసుకుంటే. హీరో త‌న అత్త కోసం బ్యాగ్ స‌ర్ధుకుని ఇండియా కు ప్ర‌యాణం అవుతాడు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో సినిమా జ‌ల్సా లో కూడా న‌క్స‌లైట్ నుంచి జ‌న జీవ‌న శ్ర‌వంతి లోకి రావ‌డానికి బ్యాగ్ ను ఎత్తాడు. అలాగే మ‌రో సినిమా అజ్ఞాత వాసి చూసుకుంటే.. హీరో త‌న కుటుంబానికి దూరంగా ఉంటాడు. ఆ కుటుంబానికి స‌మ‌స్య వ‌చ్చిన స‌మ‌యం లో మ‌ళ్లీ బ్యాగ్ ఎత్తేస్తాడు.

Advertisement

Also Read: పుష్ప లో బంపరాఫర్ కొట్టేసిన ఈ భామని గుర్తుపట్టారా…?

అలాగే ఎన్టీఆర్ అర‌వింద స‌మేతా వీర రాఘ‌వ సినిమా లో హీరో త‌న గ్రామం లో ఫ్యాక్ష‌న్ గొడ‌వల నుంచి దూరం గా ఉండ‌టానికి బ్యాగ్ తో హైద‌రాబాద్ వ‌స్తాడు. అల్లు అర్జున్ హీరో గా వ‌చ్చిన అలా వైకుంఠ పూరం లో సినిమా లో అయితే హీరో పుట్టిన కొద్ది నిమిషాల లో నే వేరో చోటికి వెళ్తాడు. జులాయి సినిమా లో విల‌న్ సోను సూద్ నుంచి త‌ప్పించు కోవ‌డానికి తాను చ‌నిపోయాడు.. అని న‌మ్మించి విశాఖ‌ప‌ట్నం వెళ్తాడు. ఇలా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సినిమా ల‌లో హీరో బ్యాగ్ ప‌ట్టు కుని ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాల్సిందే అన్న‌ట్టు ఉంటాయి.

Visitors Are Also Reading