Home » పుష్ప లో బంపరాఫర్ కొట్టేసిన ఈ భామని గుర్తుపట్టారా…?

పుష్ప లో బంపరాఫర్ కొట్టేసిన ఈ భామని గుర్తుపట్టారా…?

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఫస్టాఫ్ సునీల్ విలన్ గా ఉంటే సెకండాఫ్ లో మలయాళ నటుడు ఫాహాద్ ఫాజిల్ విలన్ గా ఉండబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Pushpa

Pushpa

అయితే ఎన్నో అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా ఫస్టాఫ్ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ట్రైలర్ కు ముందు ట్రైలర్ టీజ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ టీజ్ లో ట్రైలర్ శాంపుల్ చూపించారు. టీజ్ లో దాదాపు అన్ని పాత్రలను కవర్ చేశారు. అయితే అందులో రష్మిక బైక్ నడుపుతున్న ఓ సన్నివేశం చూసే ఉంటారు. ఆ సీన్ లో రష్మిక బైక్ పై వెనక కూర్చున్న ఒక అమ్మాయి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ అమ్మాయి ఎవరో కాదు…. ఇటీవల కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించిన శ్రీ పాద కావడం విశేషం.

Advertisement

Advertisement

Actress sripada

Actress sripada

శ్రీ పాద చాయ్ బిస్కెట్ వీడియోలతో పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత వెండితెరకు పరిచయం అయింది. మిడిల్ క్లాస్ అబ్బాయి, హెడ్స్ అండ్ టెల్స్ సినిమాలలోనూ శ్రీపాద కీలక పాత్రలో నటించింది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా పుష్ప లో శ్రీపాదకు అవకాశం రావడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో శ్రీపాద ఎలాంటి పాత్ర చేస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి శ్రీపాద బంపర్ ఆఫర్ కొట్టేసింది అంటూ ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

Visitors Are Also Reading