Home » Balayya unstoppable : ANR ను ఇమిటేట్ చేసిన బాలయ్య…నవ్వులే నవ్వులు…!

Balayya unstoppable : ANR ను ఇమిటేట్ చేసిన బాలయ్య…నవ్వులే నవ్వులు…!

by AJAY
Ad

నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు ఆహా ఓటిటి లో టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య అన్ స్టాపబుల్ పేరుతో ఈ టాక్ టాక్ షో ప్రసారమవుతోంది. ఇక ఈ షోలో బాలయ్య సినిమాల్లో ఎంత వినోదం ఉంటుందో అంతకు రెట్టింపు వినోదాన్ని పంచుతున్నారు. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీ నుండి మోహన్ బాబు గెస్ట్ గా వచ్చారు. ఆయనతోపాటు మంచు లక్ష్మి, మంచు విష్ణు కూడా వచ్చి సందడి చేశారు. ఆ తర్వాత రెండో ఎపిసోడ్ కు నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చారు.

Balayya unstoppable

Balayya unstoppable

ఇక ఇప్పటికే 3వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే. 3వ ఎపిసోడ్ లో అతిథులుగా బ్రహ్మానందం మరియు దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చారు. కాగా తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించి మరో ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో లో బాలకృష్ణ ను బ్రహ్మానందం నాగేశ్వరరావు గారిలా నటించాలి అంటూ కోరారు. దాంతో బాలయ్య ఏమీ ఆలోచించకుండా అక్కినేనిలా నటించడం ప్రారంభించారు. “మాతా ముర నీవు నటించగల వా” అంటూ ఓ పొడవాటి డైలాగును బాలయ్య గుక్క తప్పకుండా చెప్పారు.

Advertisement

Advertisement

దాంతో బ్రహ్మానందం అనిల్ రావిపూడి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన కామెడీ అక్కడ కూర్చున్న వాళ్లందర్నీ కడుపుబ్బా నవ్వించింది. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. దాంతో బాలయ్య ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అని స్టేజ్ పై ఉన్న వారందరినీ నవ్వించారు అని… అతను తప్ప మరెవరూ ఈ షో చేయలేరని కామెంట్లు పెడుతున్నారు. ఇక బాలయ్య అఖండ సినిమా షూటింగ్ సమయంలో చేతికి దెబ్బ తగిలింది. దాంతో ఇప్పటికీ ఆయన చేతికి బ్యాండేజి వేసుకొని ఉన్నారు. ఇప్పుడు షోకు సైతం ఆయన అలానే వచ్చి హోస్ట్ గా చేశారు.

Visitors Are Also Reading