పదహారణాల తెలుగు అమ్మాయి అంటే పదహారేళ్ల తెలుగు అమ్మాయి అని చాలామంది పొరపాటు పడే వాళ్ళు ఉంటారు. తెలుగు సంస్కృతిని అచ్చంగా కల్తీ లేకుండా ఇతర సంస్కృతుల ప్రభావం లేకుండా ప్రతిబింబించే అమ్మాయిని ఊహించుకుని పదహారణాల తెలుగు అమ్మాయి అంటారు.ఈ మాట అంతా ఉపయోగిస్తారు. కానీ మరి పదహారాణాల తెలుగు అమ్మాయి అని ఎందుకు అంటారో తెలియాలంటే పదహారాణాలు అంటే ఏమిటో తెలియాలి.
Advertisement
పూర్వం మన కరెన్సీ అణాల రూపంలో ఉండేది. ఆ తరువాత కాలంలో రూపాయి వచ్చింది. రూపాయి అంటే వంద పైసలు మరి అణాలను పైసలుగా పైసలను అణాలుగా మార్చాలంటే ఎలా పదహారాణాలు అంటే ఎంత అవుతుంది. ఒక అణా అంటే 6.25 పైసలు అనగా రూపాయిలో 16వ వంతు. చారాణా అంటే 4*6.25 = 25 పైసలు అదేవిధంగా ఆటాణా అనగా 8*6.25= 50 పైసలు, అలాగా బారాణా అంటే 12*6.25 = 75 పైసలు. ఇలా పదహారాణాలు అంటే 12*6.25 = 100 పైసలు. అనగా రూపాయి లేదా నూటికి నూరు శాతం అని అర్థం.
Also Read : బ్లాక్ బస్టర్ సీరియల్ చక్రవాకం నటీనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..!
Advertisement
అదేమాదిరిగా నూటికి నూరు శాతం తెలుగమ్మాయి నిండైన తెలుగు అమ్మాయి అంటే నూరు శాతం తెలుగు అమ్మాయిలా ఉండాలి. తన భాషలో, భావనలో, నడకలో, నడతలో, ఆహార్యంలో, వస్త్ర ధారణలో ప్రతీ విషయంలో తెలుగుదనాన్ని మాత్రమే నింపుకున్న అమ్మాయిని పదహారాణాల తెలుగమ్మాయి అంటారు. పదహారు ఆణాలు కలిస్తే.. 100 పైసలు అయినట్టే.. పదహారు అలంకారాలను కలిగి ఉన్న అమ్మాయిన ఇపదహారణాల తెలుగు అమ్మాయి అంటారు.
ముఖ్యంగా స్త్రీ 16 అలంకారాలు ఉంటుందట. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దంతదావనం
నలుగుపెట్టి స్నానం.
పసుపు రాసుకోవడం
చీర, రవిక ధరించడం
కాళ్లకు పారాణి
జుట్టు చక్కగా దువ్వుకోవడం,
జడకు నిండుగా పూలు పెట్టుకోవడం
పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం
బుగ్గన చక్కటి చుక్క
నుదిటిన బొట్టు
చేతులకు గోరింటాకు
తాంబూలం
పెదవులకు ఎర్రటి రంగు
కళ్లకు కాటుక
సర్వాభరణ అలంకరణ
పెళ్లైన స్త్రీకి మంగళసూత్రం, మెట్టెలు, నల్లపూసలు వేసుకోవడం వంటివి 16 అలంకారాలు అందుకే 16 ఆణాలు తెలుగు అమ్మాయి అని అంటారు.
Also Read : కూతురితో డేటింగ్ అంటూ అలియా భట్ తండ్రి దుమారం..అప్పట్లో సంచలనం..!