Home » బ్లాక్ బ‌స్ట‌ర్ సీరియ‌ల్ చ‌క్ర‌వాకం న‌టీన‌టులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..!

బ్లాక్ బ‌స్ట‌ర్ సీరియ‌ల్ చ‌క్ర‌వాకం న‌టీన‌టులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..!

by AJAY
Ad

ఎన్నో సిరీయ‌ల్స్ మ‌రియు సినిమాలు వ‌స్తుంటాయి పోతుంటాయి. కానీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోయేవి మాత్రం కొన్నే ఉంటాయి. అలా ప్రేక్ష‌కుల హృద‌యాల‌లో సుస్థిరస్థానం సంపాదించుకున్న సీరియ‌ల్ చ‌క్ర‌వాకం. ఎప్పుడూ ఏడుపుగొట్టు సీరియ‌ల్స్ ను చూసి బాధ‌ప‌డ్డ తెలుగుప్రేక్ష‌కుల‌కు ఈ సీరియ‌ల్ ఎంతో వినోదాన్ని పంచింది. ప్రేమ‌,యాక్ష‌న్, కామెడీ ఒక సినిమా రేంజ్ లో ఉండ‌టంతో ఈ సీరియ‌ల్ కు ప్రేక్ష‌కులు అతుక్కుపోవేయారు. ఇక ఈ సీరియ‌ల్ న‌టీన‌టులు కూడా త‌మ న‌ట‌న ఇర‌గ‌దీశారు. అయితే ఇప్పుడు వాళ్లంతా ఎక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నార‌న్న‌ది తెలుసుకోవాల‌ని అభిమానుల‌కు ఉంటుంది. కాబ‌ట్టి ఇప్పుడు వాళ్లు ఎలా ఉన్నారు..ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.

ALSO READ : కూతురితో డేటింగ్ అంటూ అలియా భ‌ట్ తండ్రి దుమారం..అప్ప‌ట్లో సంచ‌ల‌నం..!

Advertisement

ఇంద్ర‌నీల్
చ‌క్ర‌వాకం సీరియ‌ల్ లో హీరోగా న‌టించిన న‌టుడు ఇంద్ర‌నీల్ వ‌ర్మ‌. ప్ర‌స్త‌తం ఇంద్ర‌నీల్ తెలుగు సీరియ‌ల్స్ లోనే న‌టిస్తున్నారు. చక్రవాకం సీరియ‌ల్ లో త‌న‌కు అత్త‌గా న‌టించిన గుజారాతీ న‌టి మేగ‌నా ర‌మ్మీని వివాహం చేసుకున్నాడు. అప్పుడ‌ప్పుడు త‌న భార్య‌తో క‌లిసి టీవీషోల‌లో సంద‌డి చేస్తుంటాడు.

 

సెల్వ‌రాజ్
చక్ర‌వాకం సీరియ‌ల్ లో ఇక్బాల్ పాత్ర‌లో న‌టించిన సెల్వ‌రాజ్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ఇక్బాల్ సీరియ‌ల్స్ లోనే విల‌న్ పాత్ర‌లు చేస్తూ బిజీగా ఉన్నాడు.

Advertisement

లిఖిత కామిని
లిఖిత కామిని చక్ర‌వాకం సీరియ‌ల్ లో ఓ హీరోయిన్ గా న‌టించి ఆక‌ట్టుకుంది. తెలుగమ్మాయి అయిన లిఖిత ఆ త‌ర‌వాత మొగిలిరేఖులు సీరియ‌ల్ లోనూ న‌టించింది. ప్ర‌స్తుతం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది.

శృతి
చ‌క్రవాకం సీరియ‌ల్ లో మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌లో శృతి న‌టించింది. ఏకంగా 100కు పైగా సీరియ‌ల్స్ లో న‌టించి శృతి ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో ద‌గ్గ‌ర‌య్యింది. శృతి భ‌ర్త మ‌ధుసూద‌న్ కూడా న‌టుడే…ఇక వీరిద్ద‌రూ ప్రస్తుతం సీరియ‌ళ్లు సినిమాల్లో న‌టిస్తున్నారు.

మేధా
చ‌క్రవాకంలో న‌టించిన హీరోయిన్ల‌లో మేధా కూడా ఒక‌రు. ఆ త‌ర‌వాత మొగిలిరేకులు సీరియ‌ల్ లో కూడా మేధా న‌టించి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

సాగ‌ర్
తెలంగాణ కుర్రాడు సాగ‌ర్ చ‌క్ర‌వాకం సీరియ‌ల్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. పోలీస్ లుక్ లో క‌నిపించిన సాగ‌ర్ కు ఎంతోమంది అభిమానులు అయ్యారు. ఇక ప్రస్తుతం సాగ‌ర్ సినిమాల్లో న‌టిస్తున్నాడు. రీసెంగ్ గా షాదీ ముబార‌క్ సినిమాలో న‌టించాడు.

ప్రీతి అమిన్
చ‌క్ర‌వాకం సీరియ‌ల్ లో ప్రీతి అమిన్ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది. తెలుగుతో పాటూ ప్రీతి హిందీ సీరియ‌ల్స్ లోనూ న‌టించింది. ప్ర‌స్తుతం అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లిచేసుకుని సెటిల్ అయ్యింది.

Visitors Are Also Reading