సినీ ఇండస్ట్రీలో చాలా మంది కో వర్కర్స్ ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిన వారున్నారు. అలాంటి జంటల్లో సీనియర్ ఆర్టిస్ట్ రమాప్రభ, శరత్ బాబు కూడా ఉన్నారు. రమాప్రభ గారు ఆమె కంటే వయసులో చాలా చిన్న వాడు అయినటువంటి శరత్ బాబును ప్రేమించారు. తొలత ఆమె నుంచే ప్రేమ ప్రారంభం అయిందని అప్పటి సీనియర్ జర్నలిస్టులు పేర్కొంటున్నారు.
Advertisement
వాస్తవానికి శరత్ బాబు అప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదట. ఒక రూమ్ లో ముగ్గురితో కలిసి ఉండేవారు. అలాంటి సమయంలో రమాప్రభ గారి పరిచయం ప్రేమ వల్ల ఆయనకు చాలా అవకాశాలు వచ్చాయనిఅంటుంటారు. తాజాగా శరత్ బాబు మృతి చెందిన విషయం తెలిసిందే. శరత్ బాబు మరణించిన ఈ సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంలోకి ఇలాంటి విషయాల గురించి చర్చలు సరైనది కావు.
Advertisement
అయినప్పటికీ సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా రమాప్రభ గారే నిర్మాతగా శరత్ బాబుని హీరోని చేస్తూ సినిమా కూడా తీశారని, పలు అవకాశాలను కూడా ఆమె ఇప్పించారని అప్పటివారు చెబుతారు. అలా వారి ప్రేమ కొద్దిరోజులకు పెళ్లి పీటలు ఎక్కింది. వీరి పెళ్లి జరిగిన తరువాత దాదాపు 13 ఏళ్లకు వారిద్దరి మధ్య జరిగిన గొడవల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. విడిపోయిన తరువాత రమప్రభ, శరత్ బాబు తనని అవసరాలకు వాడుకుని వదిలేసాడని పలుమార్లు ఆరోపించారు. శరత్ బాబు మాత్రం ఆమె గురించి కానీ వారి బంధం గురించి కానీ ఎక్కడ మాట్లాడకపోవడం గమనార్హం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
శరత్ బాబు చివరి సినిమా ఏంటో మీకు తెలుసా ?
పుష్ప2 లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్..!