Home » పుష్ప2 లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్..!

పుష్ప2 లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్..!

by Anji
Ad

క్రికెట్ ప్రపంచంలో డేవిడ్ వార్నర్ గురించి అందరికీ తెలిసిన విషయం తెలిసిందే.  డేవిడ్ వార్నర్ మైదానంలో ఎంత సీరియస్ గా ఆడతాడో మైదానం వెలుపల కూడా చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడుతాడు. డేవిడ్ ఎక్కువగా సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా డేవిడ్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా  అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పాటలను, డైలాగులను స్పూఫ్ చేసేవాడు వార్నర్. దీంతో ఆయన వీడియోలకు ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. బాలీవుడ్ సహా తెలుగు పాటలకు కూడా వార్నర్ డాన్స్  చేస్తూ అలరిస్తున్నాడు.

Advertisement

భారీ బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాపులర్ డైలాగులను వినిపించాడు. అతను భారతీయ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప సినిమాలోని పాటలను, డైలాగులపై అనేక వీడియోలు రూపొందించి వేవ్స్ క్రియేట్ చేశాడు. తాజాగా డేవిడ్ పుష్ప 2 సినిమా పోస్టర్ లో తన ముఖాన్ని మార్కింగ్ చేసి విడుదల చేశాడు. దీంతో మరోసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను కృషి చేశాడు. అయితే ఇప్పుడు వార్నర్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. నిజంగానే ఈ సినిమాలో నటిస్తున్నారా అని అడిగితే దానికి చాలా సరదాగా సమాధానం ఇచ్చాడు.

Advertisement

 

వార్నర్ మొదట చిరునవ్వులు చిందించాడు. తర్వాత నటులను నటించనివ్వమని సూచించాడు. పుష్ప 2 లో మిమ్మల్ని అతిధి పాత్రలో చూడాలి అని అడగ్గా.. అవును నటీనటులకు ఛాన్స్ ఇవ్వండి అంటూ మహేష్ బాబు, అల్లు అర్జున్, రష్మిక లాంటి స్టార్స్ తో నటించాలని ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే సినిమాలో విలన్ గా నటించాలని ఉంది అని, అది నా స్వభావం అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. మరి సుకుమార్ వార్నర్ కోసం పుష్ప సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఇస్తాడో లేదో చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వేసవికాలంలో శరీరం నుంచి దుర్వాసన రావడానికి కారణం ఏంటో తెలుసా ?

రామ్ చరణ్ గురించి కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading