Home » గోత్రం అంటే ఏమిటి..దీని వెనక ఇంత సైన్స్ దాగి ఉందా..!!

గోత్రం అంటే ఏమిటి..దీని వెనక ఇంత సైన్స్ దాగి ఉందా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మనం సాధారణంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజ చేసే సమయంలో పూజారి మనం అడిగిన మొదటి ప్రశ్న నీ గోత్రం ఏమిటో చెప్పండి.. అంటారు. మరి ఆ గోత్రం అంటే ఏమిటి.. గోత్ర నామాలపై పూజలు ఎందుకు చేస్తారు.. ఒకసారి చూడండి..!! పూర్వ కాలం నుంచి ఈ గోత్రమనే పదం వాడుకలో ఉంది.. గోత్రం వెనుక కూడా సైన్స్ దాగి ఉంది. అది ఏంటంటే.. ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా జీన్ మ్యాపింగ్ అనే పదాన్ని వింటూ ఉంటాం. ఇది ఒక అధునాతన శాస్త్రం. అసలు గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ఈ వ్యవస్థ ఎందుకు ఉన్నది. వివాహంలో దీన్ని చాలా ముఖ్యంగా ఎందుకు భావిస్తారు. కొడుకులకు మాత్రమే గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది.

కూతుర్లకు ఎందుకు రావడం లేదు. వివాహం తర్వాత కుమార్తె గోత్రం అలా ఎందుకు మారుతుంది. గోత్రం అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది. మొదటి పదం గో అంటే ఆవు త్రాహి అంటే కొట్టం. గోత్రము అంటే గోశాల అని అర్థం. జీవ శాస్త్రం పరంగా చూసుకుంటే మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో లైంగిక క్రోమోజోములు ఒకటి తండ్రి నుంచి ఒక తల్లి నుంచి వచ్చే ఒక జత ఉంటుంది. ఈ రెండు క్రోమోజోములు మాత్రమే వ్యక్తి యొక్క లింగనిర్ధారణ చేస్తాయి. గర్భధారణ సమయంలో ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే అమ్మాయి పుడుతుంది అంటారు..

Advertisement

Advertisement

అలాగే ఎక్స్, వై అయితే అబ్బాయి పుడతాడు అని నమ్ముతారు. ఇందులో ఎక్స్ తల్లి నుంచి వై తండ్రి నుంచి తీసుకుంటుంది. స్త్రీలు ఎప్పటికీ వై పొందరు కాబట్టి తన అత్తవారింటి గోత్రం వస్తుంది. అలా తన కూతురు గోత్రం వివాహం తర్వాత మార్పు చెందుతుంది. ఒకే గోత్రానికి చెందిన వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదం ఉంది. గోత్రం ప్రకారం సంక్రమించిన వై క్రోమోజోములు ఒకటీగా ఉండకూడదు ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాల్ని సక్రియం చేస్తుంది. ఈ ప్రపంచంలో వై క్రోమోజోమ్ లేనట్లయితే మగజాతి అంతమవుతుంది. కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి వై క్రోమోజోములు రక్షించడానికి ఉపయోగించే పద్ధతి స్వా గోత్రం.

also read;

“సర్కారువారిపాట” లో జనసేనను టార్గెట్ చేశారా….? గాజు గ్లాసు సీన్ పై పవన్ ఫ్యాన్స్ అనుమానాలు…!

“జబర్దస్త్” శాంతి స్వరూప్ ని హైపర్ ఆది టీం అంతలా అవమానించారా ?

 

Visitors Are Also Reading