Home » మరణించిన వారిని హిందువులు దహనం ఎందుకు చేస్తారో మీకు తెలుసా ?

మరణించిన వారిని హిందువులు దహనం ఎందుకు చేస్తారో మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మతాలు ఉన్నాయి. వివిధ మతాలకు చెందిన వారు తమ తమ ఆచారాలను, సాంప్రదాయాలను పాటిస్తుంటారు.  ఏ మతం తీసుకున్నప్పటికీ.. తమ వర్గం వ్యక్తి ఎవరైనా మరణిస్తే పూడ్చడమో, కాల్చడమో చేస్తుంటారు. వారి పద్దతులను పాటిస్తూ కార్యక్రమం నిర్వహిస్తారు. హిందూమతంలో ఎవరైనా వ్యక్తులు చనిపోతే దహనం చేస్తారు. అలా ఎందుకు దహనం చేస్తారో మీకు తెలుసా..? దాని వెనుక దాగి కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

 

మనిషి బతికి ఉన్నప్పుడు తెలిసి తెలియక ఎంతో కొంత పాపం చేస్తాడు. కొందరూ అయితే నిరంతరం పాపం పనులు చేస్తూనే ఉంటారు. ఎవరైనా చనిపోతే హిందూ మతంలో మాత్రం ఆచారం ప్రకారం దహనం చేస్తారు. అలా అగ్నిలో వేసి దహనం చేయడం వల్ల అతనికి ఉండే మరుసటి జన్మలోనైనా అతను పాపాలు చేయకుండా పరిశుద్ధుడిగా జీవిస్తాడట. అందుకే హిందూ మతంలో చనిపోయిన వారిని దహనం చేస్తారు. ఇంకో కారణం ఏంటంటే..? చనిపోయిన వ్యక్తి శరీరాన్ని ఆత్మ అలాగే అంటి పెట్టుకొని ఉంటుంది. ఆత్మ ఆ శరీరాన్ని వదిలివెళ్లాలంటే దానిని దహనం చేయాలి.

Advertisement

అలా చేస్తేనే శరీరం నుంచి ఆత్మ విడిపోయి మరో దేహాన్ని చూసుకుంటుంది. దహనం చేయనంత వరకు ఆత్మ అలాగే తిరుగుతూ ఉంటుందట. కాబట్టి హిందూ మతంలో చనిపోయిన వ్యక్తిని దహనం చేస్తారు. ఎవ్వరినీ దహనం చేసిన నీటి ప్రవాహం ఉన్న నదులు, చెరువుల వద్దనే ఆ పని చేస్తారు. దీంతో ఆత్మ పరిశుద్ధమవుతుందని నమ్ముతారు. ఇక దహనం చేశాక వచ్చే బూడిదను నీటిలో కలుపుతారు. అలా కలపడం వల్ల ఆత్మ పంచ భూతాల్లో కలుస్తుందని నమ్ముతారు. 13వ రోజు పిండ ప్రదానం చేస్తారు. దీంతో ఆత్మకు విముక్తి కలిగి దేహంలోకి వెళ్తుందట. ఈ మొత్తం ప్రక్రియను హిందువులు అంతిమ సంస్కారం అని పిలుస్తారు. మనిషి జీవితకాలంలో జరిగే సంస్కారాల్లో ఇదే చివరిది.

Also Read :  సెల్ ఫోన్ కి ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా..?

Visitors Are Also Reading