పూర్వకాలంలో అరటి ఆకును ఎక్కువగా భోజనానికి వినియోగించేవారు. సైన్స్ అభివృద్ధి చెందకముందే అరటి ఆకు యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నారు భారతీయులు. గతంలో విధిగా ప్రతి ఇంట్లో ఓ అరటిచెట్టును పెంచేవారు. అరటి ఆకులో భోజనం ఎంతో శ్రేష్టమైనది.
అందుకే ఆనవాయితిగా అరటిఆకులో భోజనం చేసేవారు. అరటి ఆకు ఎందుకు అంత శ్రేష్టమైనది అంటే పూర్వం రాజులపై అధికారులపై ఎక్కువగా విష ప్రయోగాలు జరిగేవి. ఆ ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు అరటి ఆకులను విరివిగా ఆడేవారు. ముఖ్యంగా అన్నంలో విషపదార్థాలు కలిస్తే అరటిఆకు నల్లగా మారిపోతుంది. అలా మారిపోతున్నప్పుడు ఆ అన్నంలో విషంకలిపారని సులభంగా అర్థమైపోయేది.
వేడి వేడి అన్నం అరటి ఆకులో వడ్డించినప్పుడు అరటిఆకులో ఉండే రకరకాల పోషక పదార్థాలు ఆహారంలో కలవడం వల్ల ఆ ఆహారం మరింత రుచికరంగా తయారవుతుంది. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ఆకలి పెరుగుతుంది. అదేవిధంగా అరటి ఆకు ప్లాస్టిక్ మాదిరిగా కాకుండా అత్యంత తేలికగా భూమిలో కలిసి పోతుంది. ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్లు భూమిలో కలవాలంటే చాలా ఏండ్ల సమయం పడుతుంది. దీంతో అరటి ఆకు పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ధర్మశాస్త్రం ప్రకారం.. అన్ని వడ్డించిన ఇస్తరి ముందు కూర్చోరాదు. కూర్చున్న తరువాతనే వడ్డించుకుని భుజించుకోవాలి. ఎందుకనగా అన్నం కోసం మనం ఎదురు చూడాలి కానీ మన కోసం అన్నం ఎదురు చూడకూడదు అని పూర్వికులు చెబుతుంటారు. ఆ విధంగా చేయడం మూలంగా రాబోయే రోజుల్లో అష్టదరిద్రం చుట్టుకుంటుంది. అరటి ఆకులో ఎప్పుడు కూడా తొలుత ఉప్పును వేయకూడదు. అదేవిధంగా అరటి ఆకులో భోజనం చేసేటప్పుడు తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉండి భోజనం చేస్తే దీర్ఘాయుస్సు పెరుగుతుంది.
ఇవి చదవండి :
- KGF-2 REVIEW RATING : కేజీఎఫ్-2 రివ్యూ & రేటింగ్….!
- నెంబర్ వన్ రష్మికనే అంటున్న ఫ్యాన్స్… పూజా హెగ్డే మేనియా తగ్గిందా..!!
- Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి