Home » బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రో తెలుసా ?

బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రో తెలుసా ?

by Anji
Ad

బిగ్ బాస్ నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ వారం ఎలిమేష‌న్ అయ్యేది ఎవ‌రో లీకు వీరుల ద్వారా ఆటోమెటిక్ గా తెలిసిపోయింది. ఇప్ప‌టికే ఎపిసోడ్ షూటింగ్ పూర్త‌వ్వ‌గా.. ఎవ్వ‌రూ ఊహించని విధంగా ఓ ఫీమెల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ నామినేష‌న్స్‌లో ఉండ‌గా.. రేవంత్ టాప్ ఓటింగ్ తో సేవ్ అయిన‌ట్టు స‌మాచారం. త‌ను అనుకున్న‌ది అనుకున్న‌ట్టు కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడుతున్న ఇయ‌న భారీ ఓటింగ్ సంపాదించి అంద‌రికీ ఝ‌ల‌క్ ఇచ్చింది.

Advertisement

అన్ అఫిషియ‌ల్ ఓటింగ్‌లో ఆమెకు భారీగా ఓట్లు వ‌చ్చాయి. శ్రీ‌హాన్ య‌థావిదిగానే సేవ్ అయ్యాడ‌ని తెలుస్తోంది. కీర్తి భ‌ట్‌కి టీవీ వీక్ష‌కుల‌తో పాటు సింప‌థి ఓట్లు ప్ల‌స్ అయ్యాయి. కంటెంట్ ఇస్తున్న గ‌లాటా గీతు కూడా సేఫ్ అయింది. ఈ మ‌ధ్య‌కాలంలో ఆట‌తీరు మార్చుకున్న రాజ్‌ను కూడా బిగ్ బాస్ ఇంట్లో కొద్ది రోజుల పాటు ఉంచాల‌ని వీక్ష‌కులు డిసైడ్ అయ్యారు. స‌త్య‌తో పులిహోర క‌లుపుతూ అర్జున్ క‌ళ్యాణ్ సేవ్ అయ్యాడు. ఆర్జే సూర్య సుదీప‌, ఆరోహి చాలా త‌క్కువ ఓట్ల‌తో డేంజ‌ర్ జోన్‌లో ప‌డ్డారు. ఈ త‌రుణంలోనే ఆరోహి ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన‌ట్టు స‌మాచారం. ఇక ఆరోహి ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడుతుంది. ఎవ్వ‌రితోనైనా బ‌రాబ‌ర్ మాట్లాడుతుంది. ఆమె బిగ్‌బాస్‌కి ముందు జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌డం ఒక మైన‌స్‌. సూర్య‌తో స్నేహం కార‌ణంగా కొన్ని టాస్క్‌ల్లో ఆరోహి కాంప్ర‌మైజ్ అయిన‌ట్టు మ‌రికొంద‌రి వెర్ష‌న్‌.

Advertisement

Also Read :  అలనాటి స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో మీకు తెలుసా..?


మొత్తానికి ఆరోహి ఎలిమేష‌న్‌ను చాలా మంది ఊహించ‌ర‌నే చెప్పాలి. నిజం చెప్పాలంటే బిగ్‌బాస్ ఇంట్లో ఇంకా ఉన్న కొంద‌రితో పోల్చుకుంటే ఆరోహి చాలా యాక్టివ్. గేమ్ బాగా ఆడుతుంది. కంటెంట్ కూడా ఇస్తుంది. కానీ ఏం చేస్తాం.. జ‌నాల ఓటింగ్ ని గౌర‌వించాలి. ఈ సీజ‌న్ బిగ్ బాస్ అంతగా రంజిప‌జేయం లేద‌న్నది చాలా మంది వెర్ష‌న్‌. హోస్ట్ నాగార్జున వార్నింగ్ ఇచ్చి విసిగిపోయి చివ‌రికీ చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనివిధంగా త‌నే ఇద్ద‌రినీ నామినేట్ చేసింది. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ కొంద‌రూ రేలంగి మామ‌య్య‌లు పులిహోర రాజాలు కంటెంట్ ఇవ్వడంలో విఫ‌లమ‌వుతూనే ఉన్నారు. లెట్స్ సీ మున్ముందు అయినా హీట్ పెరుగుతుందేమో చూడాలి.

Also Read :  రీల్ హీరోకు రియ‌ల్ హీరోకు తేడా ఇదేనంటూ గాడ్ ఫాద‌ర్ లో ఈ సీన్ పై నెటిజ‌న్ల‌ ట్రోల్స్…! ఎందుకంటే..?

Visitors Are Also Reading