Home » అలనాటి స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో మీకు తెలుసా..?

అలనాటి స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

చాలామంది నటీనటులకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని అనూహ్య సంఘటనలు ఎదురవుతాయి.. అనుకోని మార్పులు కూడా జరుగుతాయి. అది ముఖ్యంగా వారి పేర్ల విషయంలో.. కొంతమందికి అత్యంత సక్సెస్ ఇచ్చిన పాత్రలు వారి పేర్లకు ముందు వెనక లేదంటే పేరు గానో ఉండిపోతాయి.. అలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదిగి పేర్లను మార్చుకున్న కథానాయికలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
శ్రీదేవి :

తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నటించి అతిలోకసుందరిగా పేరు తెచ్చుకుంది.. ఈమె అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగారు అయ్యప్పన్.. తర్వాత ఇది శ్రీదేవి గా మారింది.

Advertisement

ALSO READ;పగలంతా చదివి.. రాత్రిళ్లు పెయింటింగ్.. డైరెక్టర్ కోడి రామకృష్ణ కన్నీటి గాథ..!!

జీవితా రాజశేఖర్ :


తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది జీవితా రాజశేఖర్. కథానాయిక గా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈమె అసలు పేరు పద్మ.. ఆమె ఇంట్లో అందరూ పెద్ద పద్మ బొట్టు పద్మ అని కూడా పిలిచే వారట.
సౌందర్య:

Advertisement


తెలుగు ఇండస్ట్రీలో వందకు పైగా చిత్రాల్లో నటించి స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన హీరోయిన్ సౌందర్య. అచ్చం తెలుగింటి అమ్మాయి లా కనిపించే ఈ అమ్మడు అసలు పేరు సౌమ్య.. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత సౌందర్య గా మార్చుకున్నారు.
ఆమని:


చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఆమని స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్నారు.. ఈమె అసలు పేరు మంజుల.
రోజా :


సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవి చేపట్టారు. రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి.
జయసుధ:

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ కథానాయికగా ఎదిగింది. ప్రస్తుతం తల్లి,అత్త పాత్రలు చేస్తున్న జయసుధ అసలు పేరు సుజాత.
జయప్రద:

జయప్రద అసలు పేరు లలితా రాణి.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె పేరు మార్చుకున్నారు.\

ALSO READ;రీల్ హీరోకు రియ‌ల్ హీరోకు తేడా ఇదేనంటూ గాడ్ ఫాద‌ర్ లో ఈ సీన్ పై నెటిజ‌న్ల‌ ట్రోల్స్…! ఎందుకంటే..?

Visitors Are Also Reading