Telugu News » Blog » రీల్ హీరోకు రియ‌ల్ హీరోకు తేడా ఇదేనంటూ గాడ్ ఫాద‌ర్ లో ఈ సీన్ పై నెటిజ‌న్ల‌ ట్రోల్స్…! ఎందుకంటే..?

రీల్ హీరోకు రియ‌ల్ హీరోకు తేడా ఇదేనంటూ గాడ్ ఫాద‌ర్ లో ఈ సీన్ పై నెటిజ‌న్ల‌ ట్రోల్స్…! ఎందుకంటే..?

by AJAY
Ads

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో డిజాస్ట‌ర్ ను త‌న ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రామ్ చ‌ర‌ణ్ కూడా సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమాతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇక ప్ర‌స్తుతం గాఢ్ ఫాద‌ర్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను మ‌ల‌యాళ సూపర్ హిట్ లూసీఫ‌ర్ కు రీమేక్ గా తెర‌కెక్కిస్తున్నారు.

Advertisement

ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో సునీల్,న‌య‌న‌తార లు ముఖ్య‌మైన పాత్ర‌లలో న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమా మ‌ల‌యాళ ఒరిజిన‌ల్ లో మోహ‌న్ లాల్ హీరోగా న‌టించాడు. ఈ సినిమా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌గా అక్క‌డ భారీ విజ‌యం సాధించింది. ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. ఇక తెలుగులో రీమేక్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ప్పుడు ఈ సినిమా ద‌ర్శ‌కునిగా చాలా మందిని అనుకున్నారు.

Advertisement

god father

god father

మొద‌ట వివి వినాయ‌క్ ను ఈ సినిమాకు అనుకున్నారు. ఆ త‌ర‌వాత పూరీ జ‌గ‌న్నాత్ పేరు కూడా వినిపించింది. వినాయ‌క్ పేరు దాదాపు ఖ‌రారు కూడా చేశారు. ఆ త‌ర‌వాత ఏం జిరింగిందో కానీ ఆయ‌న తప్పుకున్నారు. చివ‌ర‌గా మోహ‌న్ రాజా చేతికి ఈ సినిమా వ‌చ్చింది. ఇదిలా ఉంటే రీమేక్ అంటే కొంత‌మంది ఉన్న‌ది ఉన్న‌ట్టుగా తెర‌కెక్కిస్తే మ‌రికొంద‌రు మార్పులు చేర్పులు చేస్తారు.

Advertisement

ఇక గాఢ్ ఫాద‌ర్ విష‌యంలో పెద్ద‌గా మార్పులు చేయ‌న‌ట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఓ వీడియోను విడుద‌ల చేయ‌గా అందులో మెగాస్టార్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఒక‌రిని కాలు పైకి ఎత్తి త‌న్నే సీన్ క‌నిపిస్తుంది. కాగా ఆ సీన్ లో మెగాస్టార్ కాళు ఎక్కువ పైకి ఎత్త‌లేదు. కానీ లూసీఫ‌ర్ సినిమాలో మోహ‌న్ లాల్ కాలును నేరుగా పైకి ఎత్తి మెడ‌పై పెట్టిన‌ట్టు క‌నిపిస్తుంది. దాంతో మోహ‌న్ లాల్ లా ఎత్త‌లేక‌పోయిన మెగాస్టార్ అంటూ లూసీఫ‌ర్ తో పోల్చి మెగాస్టార్ లుక్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.