Home » దూకుడు సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రను రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

దూకుడు సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రను రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దూకుడు’ దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. 2011 వ సంవత్సరంలో సెప్టెంబర్ 23 న విడుదల అయిన ఈ సినిమా .. భారీ అంచనాల మధ్య విడుదల అయి బ్లాక్ బస్టర్ అయింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకి ముందు మహేష్ చాలా ప్లాప్ లు  ఉన్నారు.

Advertisement

‘పోకిరి’ తర్వాత మహేష్ సినిమా చేసిన సైనికుడు, అతిథి, ఖలేజా వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో మహేష్ బాబు ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ఇదే. ఈ సినిమాలో ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే కథ మొత్తం  ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఈ పాత్ర కోసం దర్శకుడు శ్రీను వైట్ల చాలా మంది స్టార్స్ ను అప్రోచ్ అయ్యాడు.  తొలుత  ‘దూకుడు’ లో హీరో తండ్రి పాత్ర కోసం శ్రీహరి ని అడిగాడట.

Advertisement

కానీ ఆ టైంకి ఫాదర్ రోల్ చేయడం ఇష్టం లేక ఆయన నో చెప్పారట. అయినా సరే ఈ ప్రాజెక్టుని వదులుకోలేక బ్రదర్ రోల్ గా మార్చు చేస్తాను అని అన్నాడట. కానీ తండ్రి కాకుండా అన్నగా మారిస్తే ఎమోషనల్ గా ప్రేక్షకులు కనెక్ట్ అవ్వరు అని భావించి శ్రీను వైట్ల కూడా వెనక్కి తగ్గారట. ఇక ఆ తర్వాత మహేష్ సూచన మేరకు ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నాడట శ్రీను వైట్ల.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

నిన్నే పెళ్లాడుతా మూవీ క్లైమాక్స్ ని… నాగార్జున కి దర్శకుడు చెప్పలేదు.. ఎందుకంటే..?

ప్రొడ్యూసర్ల కొడుకులు అయినా… ఇండస్ట్రీలో ఫెయిల్ అయిన హీరోలు వీళ్ళే..!

Visitors Are Also Reading