Home » అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ డూప్‌గా నటించింది ఎవరో తెలుసా ?

అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ డూప్‌గా నటించింది ఎవరో తెలుసా ?

by Anji
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ అదుర్స్. ఈ సినిమా అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. తెలంగాణ ఉద్యమం సమయంలో థియేటర్ల వద్ద భారీ బందోబస్తుతో షోలు వేయించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్  మరోసారి తన నటనతో  కట్టిపడేశారు. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో నటించి మెప్పించిన ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది.

adurs-movie

Advertisement

 

ముఖ్యంగా ఇందులో బ్రాహ్మణుడిగా ఎన్టీఆర్ నటన నిజంగానే అదుర్స్. బ్రహ్మనందం, ఎన్టీఆర్ కాంబోలో వచ్చే సీన్స్ ఈ చిత్రానికే హైలెట్. ఇప్పటికీ కూడా ఆ డైలాగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. బ్రహ్మనందంతో పోటీ పడి మరీ ఎన్టీఆర్ కామెడీ చేసి నవ్వించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ కి డూప్ నటించింది ఎవ్వరో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

సినిమాల్లో డూప్ గా నటించడం సహజమే.. అదుర్స్ సినిమా 2010లో వచ్చింది. అప్పటి టక్నాలజీ ప్రకారం ఎన్టీఆర్ కు డూప్ ను వాడారు. ఇంతకు ఎన్టీఆర్ కు డూప్ గా నటించేందుకు ఒక యాక్టర్ ను తీసుకున్నారట. సినిమాలో చాలా వరకు అతనే ఎన్టీఆర్ కు డూప్ గా నటించడట అయితే ఒక సీన్ సమయంలో ఆ డూప్ అందుబాటులో లేకపోవడంతో ఎన్టీఆర్ మేకప్ ఆర్టిస్ట్ కిరణ్ అనే వ్యక్తి ఎన్టీఆర్ కు డూప్ గా నటించాడట. కిరణ్ తోనే మిగతా సినిమా షూటింగ్ ను పూర్తి చేశారట వివినాయక్. ప్రస్తుతం వి.వి.నాయక్ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కే దేవర మూవీలో నటించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :  వెంకటేష్ కి త్రివిక్రమ్ మధ్య సంబంధం ఏంటో మీకు తెలుసా ?

Visitors Are Also Reading