Home » వెంకటేష్ కి త్రివిక్రమ్ మధ్య సంబంధం ఏంటో మీకు తెలుసా ?

వెంకటేష్ కి త్రివిక్రమ్ మధ్య సంబంధం ఏంటో మీకు తెలుసా ?

by Anji
Ad

 సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం రావాలంటే ఇండస్ట్రీలో ఏదో ఒక సర్కిల్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఎవ్వరికీ ఏ సినిమాలో మన అవసరం ఉన్నా కూడా మనకు ఉన్న సర్కిల్ ద్వారా ఆ సినిమాలో మనకు అవకాశం అయితే వస్తుంది. దీంతో మనం పెద్ద ఛాన్స్ లు వచ్చే అవకాశాలున్నాయి. వచ్చిన ప్రతీ ఆఫర్ ని సద్వినియోగం చేసుకుంటే ఇక్కడ సూపర్ స్టార్లుగా ఎదిగే అవకాశాలుంటాయి.  ఈ విషయం అన్ని క్రాప్ట్ లో ఉన్న వారికి వర్తిస్తుంది.

Advertisement

త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పోసాని కృష్ణ మురళీ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పని చేసిన విషయం మనకు తెలిసిందే. పవిత్ర బంధం సినిమాకి పోసాని వద్ద అసిస్టెంట్ రైటర్ గా పని చేస్తున్నప్పుడే వెంకటేష్ తో త్రివిక్రమ్ కి మంచి సన్నిహిత్యం ఏర్పడిందట. త్రివిక్రమ్ ఇండస్ట్రీ సర్కిల్ ఉంటే మనం ఇక్కడ ఎదగగలుగుతాం అనే విషయాన్ని గ్రహించారట. దీంతో వెంకటేష్ తో బాగా మాట్లాడి ఆయనతో చాలా చనువుగా ఉండేవారట. ఇతను రైటర్ అయిన తరువాత వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ మూవీకి కథ చెప్పే సమయంలో కూడా అంతకు ముందే వెంకటేష్ తో ఉన్న చనువు సమయంలో ఉపయోగపడిందట.

Advertisement

అలా ఇండస్ట్రీలో పరిచయాలనేవి ముఖ్యం అని చాలా మంది సినీ ప్రముఖులు సైతం చెబుతూ ఉంటారు. ఇప్పటివరకు వెంకటేష్ కి త్రివిక్రమ్ కి మధ్య మంచి అనుబంధం ఉందని వాళ్ల సన్నిహిత్య వర్గాల వారు చెబుతుంటారు. అందుకే వెంకటేష్ కి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందించాడు. ఇప్పుడు వీలైతే వెంకటేష్ తో ఓ సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.

Also Read :  చిరంజీవికి తమిళ స్టార్ హీరో ఎంజీఆర్ చెప్పిన మాట ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading