మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గ్యాంగ్ లీడర్ సినిమా ఓ స్పెషల్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా నుంచే చిరంజీవి అసలు సిసలు మెనియా స్టార్ అయింది. నటన, స్టైల్, డ్యాన్స్, కుర్రకారును ఉర్రూతలూగించింది. గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రతీ సీన్ అదిరిపోయిందనే చెప్పవచ్చు. చిరంజీవి కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా గ్యాంగ్ లీడర్ నిలిచింది. ఇక సినిమా విడుదలై 31 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1991 మే 09న విడుదలైన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. గ్యాంగ్ లీడర్ సినిమా ప్రారంభం నుంచే సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.
Advertisement
ఇది ఇలా ఉండగా.. గ్యాంగ్ లీడర్ సినిమాను తొలుత మరో హీరో ఒప్పుకున్నాడట. ఆ తరువాత చిరంజీవి వద్దకు వచ్చినట్టు సమాచారం. ఆ హీరో మరెవ్వరో కాదు చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు. సినిమాలు చేతులు మారడం అనేది చాలా ఏళ్ల నుంచే కొనసాగుతూ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కాదు.. ఎంతో మంది సీనియర్ హీరోలు కూడా ఇతర హీరోలు వదిలేసిన లేదా చేయలేకపోయిన కథలను చేసి సూపర్ హిట్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో చిరంజీవి గ్యాంగ్ లీడర్ కూడా ఒకటి. నాగబాబు చేయాల్సిన సినిమానే చిరంజీవి గ్యాంగ్ లీడర్ చేశాడు. చిరంజీవి స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే తన పెద్ద తమ్ముడు నాగబాబుని హీరోగా పరిచయం చేసే ప్రయత్నం చేశాడు.
Advertisement
చిరంజీవి నటించిన కొండవీటి దొంగ సినిమాలో నాగబాబు నటనను చూసి పరిచూరి బ్రదర్స్.. నాగబాబు హీరోగా అరే ఓ సాంబ అనే టైటిల్ తో ఓ పవర్ పుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. కొత్త హీరో అయినటుంటి నాగబాబుతో సినిమా చేసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. దీంతో ఈ కథ తన అన్న చిరంజీవికి అయితే బాగుంటుందని నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. వెంటనే దర్శకుడు బాపినీడు చిరంజీవి వద్దకు వెళ్లి కలిశాడు. ఆ కథను చిరంజీవికి వినిపించగా కొన్ని మార్పులు చేర్పులు చేసి టైటిల్ ని కూడా మార్చాడని సూచించాడట. అరే ఓ సాంబ కథను చిరంజీవి కోసం గ్యాంగ్ లీడర్ మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా తీర్చిదిద్దారు బాపినీడు. ఇప్పటికీ కూడా గ్యాంగ్ లీడర్ సినిమాను రీమెక్ చేసేందుకు పలువురు మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు. ఆ సమయంలో నాగబాబు కాంప్రమైజ్ అయి తక్కువ బడ్జెట్ తో అరే ఓ సాంబ సినిమా చేసి ఉంటే మాత్రం ఒక సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ ను టాలీవుడ్ మిస్ అయ్యేది.
Also Read :
నేను ఈరోజుకి తెలుగు చదవలేను అంటున్న మంచు లక్ష్మి పై నెటిజన్ల సెటైర్లు..!!
హీరోయిన్ల విషయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు మరీ ఇలా ఉండేవారా..?